ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టాభి సహా 14 మంది టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్ - undefined

టీడీపీ నేతల నిరసనలు
టీడీపీ నేతల నిరసనలు

By

Published : Feb 21, 2023, 11:11 AM IST

Updated : Feb 21, 2023, 9:13 PM IST

21:12 February 21

మార్చి 7వరకు రిమాండ్

  • పట్టాభి సహా అరెస్టైన మొత్తం 14మంది తెలుగుదేశం నేతలకు 14రోజుల రిమాండ్ విధించిన కోర్టు
  • మార్చి 7వరకు రిమాండ్
  • పట్టాభి ని వైద్య పరీక్షలకు పంపాలని న్యాయమూర్తి ఆదేశాలు

19:51 February 21

ముఖానికి టవల్ చుట్టి కొట్టారన్న పట్టాభి

  • గన్నవరం కోర్టులో ముగిసిన వాదనలు
  • తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న పట్టాభి
  • ముగ్గురు వ్యక్తులు ముసుగుతో వచ్చి అరగంటసేపు కొట్టారన్న పట్టాభి
  • వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారన్న పట్టాభి
  • తోట్లవల్లూరు స్టేషన్‌కు వెళ్లేసరికి అంతా చీకటిగా ఉందన్న పట్టాభి
  • కోర్టులో న్యాయవాది, న్యాయమూర్తికి వివరించిన పట్టాభి

18:53 February 21

ఏ-1 గా పట్టాభి, ఏ-2గా చిన్నా సహా మొత్తం 13 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు

గన్నవరం సీఐ కనకరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుగుదేశం నేత పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెదేపా కార్యకర్తలను రెచ్చగొట్టడం ద్వారా తనకు పట్టాభి సహా ఇంకొందరు టీడీపీ నేతలు ప్రాణహాని కలిగించే ప్రయత్నం చేశారని సీఐ కనకారావు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ-1 గా పట్టాభి, ఏ-2గా చిన్నా సహా మొత్తం 13 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సబ్​మిట్​ చేశారు.

17:37 February 21

పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌

  • గన్నవరం కోర్టు ఎదుట తెదేపా శ్రేణుల ఆందోళన
  • పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌
  • పోలీసులతో వాగ్వాదానికి దిగిన తెదేపా శ్రేణులు

16:58 February 21

నా భర్తకు ప్రాణహాని ఉంది: పట్టాభి భార్య చందన

  • నా భర్తను పోలీసులు బాగా హింసించారు: పట్టాభి భార్య చందన
  • తోట్లవల్లూరు పీఎస్‍లో పట్టాభిని ముసుగేసి కొట్టారు: చందన
  • నా భర్తకు ప్రాణహాని ఉందని మొదట్నుంచీ చెబుతున్నా: చందన

16:49 February 21

పట్టాభిని హింసించారు: గొట్టుముక్కల

సోమవారం సాయంత్రం నుంచి పట్టాభిని కొడుతూ వివిధ స్టేషన్లు తిప్పారని టీఎన్​టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టిముక్కల రఘురామరాజు మండిపడ్డారు. చివరిగా తోట్లవల్లూరు స్టేషన్​కు తీసుకొచ్చి కరెంట్ తీసేసారని దుయ్యబట్టారు. ముగ్గురు వ్యక్తులు ముసుగులు వేసుకొచ్చి పట్టాభిని తీవ్రంగా హింసించారని రఘురామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాభి ముఖానికి కూడా ముసుగువేసి గాలి ఆడకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

16:12 February 21

ఇంటిపైకి ఎక్కిన పట్టాభి భార్య చందన, తెలుగుదేశం నేతలు

తెలుగుదేశం నేత పట్టాభి సహా 11 మందిని పోలీసులు గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచిన వారిలో పట్టాభి, దొంతు చిన్నా, గురుమూర్తి సహా మరికొందరు నాయకులు ఉన్నారు. కోర్టులోకి వెళ్లేటప్పుడు వాచిపోయిన చేతులను పట్టాభి చూపించారు. ఈ సమయంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. పోలీస్ ఆంక్షలు ఛేదించుకుని కేశినేని చిన్ని, వెనిగండ్ల రాము స్టేషన్‌కు వచ్చారు. పార్టీ నేతలకు సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కూడా అక్కడికి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కార్యకర్తలు.... తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక కోర్టులోకి వెళ్లేముందు పోలీసుల అనుమతితో.. పట్టాభి తన భార్య చందనతో ఫోన్‌లో మాట్లాడారు. పోలీసులు అదుపులో ఉన్నట్టు ఆమెకు చెప్పారు. ఆ తర్వాత పట్టాభిని చూడటానికి విజయవాడ నుంచి గన్నవరం వెళ్లేందుకు ప్రయత్నించిన చందనను పోలీసులు అడ్డుకున్నారు. వారిని తీరును నిరసిస్తూ చందనతోపాటు కొందరు తెలుగుదేశం నేతలు భవనంపైకి ఎక్కారు. పట్టాభిని కలిసేందుకు అనుమతించకపోతే భవనంపై నుంచి దూకుతామని హెచ్చరించారు.

16:03 February 21

11 మంది తెదేపా నేతలను గన్నవరం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

  • 11 మంది తెదేపా నేతలను గన్నవరం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • స్థానిక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ఎదుట పట్టాభి, నాయకులను హాజరుపర్చిన పోలీసులు
  • పట్టాభి, దొంతు చిన్న, గురుమూర్తిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • కోర్టుకు వెళ్తూ వాచిపోయిన చేతులను చూపిన తెదేపా నేత పట్టాభి
  • చేతులు కమిలిపోయాయని చూపిస్తూ కోర్టు లోపలికి వెళ్లిన పట్టాభి

15:47 February 21

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీస్‌ స్టేషన్‌ వద్ద నినాదాలు

  • గన్నవరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద తెలుగుదేశం శ్రేణుల నిరసన
  • ఆంక్షలు ఛేదించుకుని స్టేషన్‌కు వచ్చిన కేశినేని చిన్ని, వెనిగండ్ల రాము
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీస్‌ స్టేషన్‌ వద్ద నినాదాలు
  • తెదేపా నేతలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్
  • గన్నవరం కోర్టు వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు

14:13 February 21

పట్టాభి సతీమణి చందనను పరామర్శించిన కేశినేని చిన్ని, ఆచంట సునీత

  • పట్టాభి సతీమణి చందనను పరామర్శించిన కేశినేని చిన్ని, ఆచంట సునీత
  • ధైర్యంగా ఉండాలని చందనకు సూచించిన కేశినేని చిన్ని
  • పార్టీతో పాటు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చిన కేశినేని చిన్ని
  • వంశీకి ఓటమి భయం పట్టుకుంది: కేశినేని చిన్ని
  • ఓటమి భయంతోనే కార్యాలయంపై దాడి చేశారు: కేశినేని చిన్ని
  • టీడీపీ వల్ల వచ్చిన ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా చేయాలి: కేశినేని చిన్ని
  • ఈసారి గన్నవరం, గుడివాడలో గెలిచేది టీడీపీనే: కేశినేని చిన్ని

14:06 February 21

గన్నవరం పీఎస్‌కు చేరుకున్న గుడివాడ టీడీపీ నేత వెనిగండ్ల రాము

  • గన్నవరం పీఎస్‌కు చేరుకున్న గుడివాడ టీడీపీ నేత వెనిగండ్ల రాము
  • టీడీపీ శ్రేణులపై దాడులు చేసి.. బాధితులపైనే అక్రమ కేసులా?: వెనిగండ్ల రాము
  • అనాగరిక చర్యలు భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు: వెనిగండ్ల రాము
  • తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంటున్నా విధ్వంసం కొనసాగిస్తున్నారు: రాము
  • అరెస్టైన తెదేపా నేతల వివరాలు తెలుసుకునేందుకే గన్నవరం వచ్చా: వెనిగండ్ల రాము

13:04 February 21

గన్నవరం పోలీస్ స్టేషన్‌లో పట్టాభి సహా 11మంది టీడీపీ నేతలు

  • అమరావతి: గన్నవరం పోలీస్ స్టేషన్‌లో పట్టాభి సహా 11మంది తెదేపా నేతలు
  • పట్టాభికి పోలీస్‌స్టేషన్‌ లోనే వైద్య పరీక్షలు
  • తెదేపా నేతలను కాసేపట్లో గన్నవరం కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు

12:29 February 21

గన్నవరంలో వైఎస్సార్​సీపీ విధ్వంసానికి నిరసనగా సూర్యాపేట జిల్లాలో టీడీపీ ధర్నా

  • గన్నవరంలో వైఎస్సార్​సీపీ విధ్వంసానికి నిరసనగా తెలంగాణలోని సూర్యాపేటలో టీడీపీ ధర్నా
  • కోదాడ మండలం నల్లబండగూడెం సరిహద్దు వద్ద టీడీపీ నేతల ధర్నా
  • టీడీపీ ధర్నాతో జాతీయ రహదారిపై కి.మీ. మేర నిలిచిన ట్రాఫిక్‌

12:16 February 21

బుద్దా వెంకన్న నివాసం వద్ద ఉద్రిక్తత

  • విజయవాడ: బుద్దా వెంకన్న నివాసం వద్ద ఉద్రిక్తత
  • బుద్దా వెంకన్న నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • విజయవాడ: పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట
  • పోలీసుల తీరును నిరసిస్తూ బైఠాయించిన బుద్దా వెంకన్న
  • పటమట ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
  • పార్టీ జెండాలతో బయటకొచ్చేందుకు సిద్ధమైన బుద్దా వెంకన్న
  • బుద్దా వెంకన్న సహా కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
  • గన్నవరం వెళ్లకుండా బుద్దా వెంకన్నను ఇంటి వద్దే అడ్డుకున్న పోలీసులు
  • చంద్రబాబు, లోకేశ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు: బుద్దా వెంకన్న
  • జగన్‌ మెప్పు కోసమే మాపై విమర్శలు చేస్తున్నారు: బుద్దా వెంకన్న
  • వ్యక్తిగత దూషణలు చేస్తే ఊరుకునేది లేదు: బుద్దా వెంకన్న
  • విమర్శలు చేస్తే సమాధానం చెప్పాలిగానీ.. దాడులు చేస్తారా?: బుద్దా వెంకన్న
  • టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసి ఎదురుదాడులు చేస్తారా?: బుద్దా వెంకన్న
  • ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వెళ్తుంటే నన్ను అడ్డుకున్నారు: బుద్దా వెంకన్న
  • కొడాలి నాని, వంశీకి ఇదే చెబుతున్నా.. వ్యక్తిగత దూషణలు మానండి: బుద్దా వెంకన్న
  • వైఎస్సార్​సీపీలో ఎంత ఎక్కువ దాడులు చేస్తే వారికి టిక్కెట్లు ఇస్తారు: బుద్దా వెంకన్న
  • పార్టీ టిక్కెట్ల కోసమే మాపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు: బుద్దా వెంకన్న

12:02 February 21

పోలీసు యంత్రాంగం వైఎస్సార్​సీపీకీ తొత్తుగా వ్యవహరించింది: పల్లా శ్రీనివాసరావు

  • పోలీసు యంత్రాంగం వైఎస్సార్​సీపీకీ తొత్తుగా వ్యవహరించింది: పల్లా శ్రీనివాసరావు
  • గన్నవరం ఘటనలో సీఐకి గాయాలైనా పోలీసు సంఘాల మౌనమెందుకో?: పల్లా
  • నిన్నటి గన్నవరం ఘటన దారుణం: బండారు సత్యనారాయణమూర్తి
  • పోలీసులు ఖాకీ దుస్తుల్లో ఉన్న వైఎస్సార్​సీపీ కార్యకర్తల్లా తయారయ్యారు: బండారు
  • పట్టాభి జాడ చెప్పాలని ఆయన భార్య ప్రాధేయపడ్డారు: బండారు సత్యనారాయణ
  • డీజీపీ మానవతా దృక్పథంతో ఆలోచించాలి: బండారు సత్యనారాయణమూర్తి

12:02 February 21

గన్నవరం దాడి ఘటనలో ఇద్దరు వైఎస్సార్​సీపీ కార్యకర్తలపై కేసు నమోదు

  • గన్నవరం దాడి ఘటనలో ఇద్దరు వైఎస్సార్​సీపీ కార్యకర్తలపై కేసు నమోదు
  • టీడీపీ నాయకురాలు దొంతు రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు

11:23 February 21

కాసేపట్లో గన్నవరం స్టేషన్‌కు టీడీపీ నేత పట్టాభి

  • కృష్ణా: కాసేపట్లో గన్నవరం స్టేషన్‌కు టీడీపీ నేత పట్టాభి
  • గన్నవరం టీడీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • బారికేడ్లతో ఎవరినీ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
  • చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై అడుగడుగునా పోలీసుల పహారా
  • ఇప్పటికే దొంతు చిన్నా, మరో ముగ్గురిని పీఎస్‌కు తరలించిన పోలీసులు
  • గన్నవరం పోలీసుస్టేషన్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

11:07 February 21

గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్​సీపీ దాడిని ఖండిస్తున్నా: కన్నా

  • గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్​సీపీ దాడిని ఖండిస్తున్నా: కన్నా
  • జగన్‌ సీఎం అయినప్పటి నుంచి దాడుల సంస్కృతి పెరిగింది: కన్నా
  • గత ముఖ్యమంత్రులు ఫ్యాక్షనిజం తగ్గించటానికి కృషిచేశారు: కన్నా
  • జగన్ మాత్రం ఫ్యాక్షన్ సంస్కృతి పెంచి పోషిస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ
  • వైఎస్సార్​సీపీ అరాచకానికి పోలీసులు వంత పాడుతున్నారు: కన్నా లక్ష్మీనారాయణ
  • ఇది మంచి విధానం కాదని డీజీపీకి చెబుతున్నా: కన్నా లక్ష్మీనారాయణ
  • ఈనెల 23న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నా: కన్నా లక్ష్మీనారాయణ
  • నాతో పాటు చాలామంది నాయకులు టీడీపీలోకి వస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

11:05 February 21

విజయవాడలోని పట్టాభి సతీమణి ఇంటికి వచ్చిన పోలీసులు

  • విజయవాడలోని పట్టాభి సతీమణి ఇంటికి వచ్చిన పోలీసులు
  • పట్టాభిని మ. 12 గం.కు గన్నవరం కోర్టుకు తీసుకొస్తామన్న పోలీసులు
  • పట్టాభితో వీడియో కాల్ మాట్లాడించాలని కోరిన చందన
  • భర్తతో మాట్లాడేందుకు చందనకు అనుమతివ్వని పోలీసులు
  • బైక్‌పై డీజీపీ ఇంటికి బయల్దేరిన పట్టాభి సతీమణి చందన
  • బైక్‌ను అడ్డుకుని చందనను ఇంటికి తీసుకొచ్చిన పోలీసులు

11:05 February 21

గన్నవరం ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పందన

  • గన్నవరం ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పందన
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ
  • చలో గన్నవరం కార్యక్రమానికి పోలీసుల అనుమతుల్లేవు: ఎస్పీ
  • విధులు నిర్వహిస్తున్న గన్నవరం సి.ఐ. కనకారావు తలకు గాయమైంది: ఎస్పీ
  • పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది: ఎస్పీ
  • టీడీపీ కార్యాలయంపై దాడి దృశ్యాలు పరిశీలిస్తున్నాం: ఎస్పీ
  • సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం: ఎస్పీ
  • గన్నవరం పీఎస్‌ పరిధిలో 144 సెక్షన్‌, 30 యాక్టు అమలు: ఎస్పీ
  • ముందస్తు అనుమతి లేకుండా సభలు, నిరసనలు చేయవద్దు: ఎస్పీ

11:05 February 21

ఫ్యాక్షనిస్టు పాలన ఎలా ఉంటుందో జగన్‌ చూపిస్తున్నారు: బొండా ఉమ

  • ఫ్యాక్షనిస్టు పాలన ఎలా ఉంటుందో జగన్‌ చూపిస్తున్నారు: బొండా ఉమ
  • భయపెట్టి గొంతు నొక్కాలని చూస్తే వెనక్కి తగ్గం: బొండా ఉమ
  • పీఎస్‌లో ఫిర్యాదు కోసం వెళ్తే అరెస్టు చేస్తారా?: బొండా ఉమ
  • పట్టాభిని పోలీసులే అరెస్టు చేశారా?: బొండా ఉమ
  • పోలీసుల ముసుగులో వైఎస్సార్​సీరీ నేతలు కిడ్నాప్ చేశారా?: బొండా ఉమ
  • మహిళా కార్యకర్తలను ఇంతవరకు అరెస్టు చూపించకుండా కస్టడీలో ఉంచారు: బొండా ఉమ
  • మహిళా పోలీసులు లేకుండా చేసిన ఈ చర్యపై ప్రైవేటు కేసులు వేస్తున్నాం: బొండా ఉమ
  • వైఎస్సార్​సీపీకి కొమ్ముకాసిన ప్రతి అధికారి ఇబ్బందిపడక తప్పదు: బొండా ఉమ

11:04 February 21

మమ్మల్ని బెదిరించే ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకోవాలి: బొండా ఉమ

  • మమ్మల్ని బెదిరించే ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకోవాలి
  • ఎంత బెదిరించినా ఇక్కడెవరూ భయపడే వాళ్లు లేరు
  • చంద్రబాబు, లోకేశ్‌ పర్యటనలను అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు
  • తూ.గో. జిల్లాలో పర్యటిస్తే ప్రజానీకమంతా చంద్రబాబుకు నీరాజనాలు పలికారు
  • చంద్రబాబుకు వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేకపోతున్నారు
  • పర్యటనలో లైట్లు ఆపేసి కుట్ర చేస్తే.. ప్రజలు సెల్‌ఫోన్‌ టార్చిలు వెలిగించి చంద్రబాబును తీసుకెళ్లారు
  • వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యేల అరాచకాలపై ప్రశ్నించడం తప్పా?
  • అరాచకాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
  • ఒక్క కార్యకర్త కూడా భయపడే ప్రసక్తి లేదని జగన్‌ గుర్తుంచుకోవాలి
  • ఏదైనా ఘటన జరిగితే బాధితులపైనే కేసులు పెడతారా?
  • వైఎస్సార్​సీపీ అరాచక పాలనను ప్రజలంతా చూస్తున్నారు
  • టీడీపీ ప్రభుత్వంలో ఎక్కడైనా ఒక్క వైఎస్సార్​సీపీ కార్యాలయంపై దాడి జరిగిందా?
  • ఫిర్యాదు చేయడానికి వెళ్తే అరెస్టు చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా?
  • ఇప్పటికీ పట్టాభి ఎవరి కస్టడీలో ఉన్నారో తెలియట్లేదు
  • పట్టాభి ఏ స్టేషన్‌లో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి
  • టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టిన వారిపై చర్యలు తీసుకోరా?

11:03 February 21

టీడీపీ నేతల గృహ నిర్బంధాలు

  • విజయవాడలో అశోక్‌బాబు, వర్ల రామయ్య గృహనిర్బంధం
  • విజయవాడలో నాగుల్‌మీరా, నెట్టెం రఘురామ్‌ గృహనిర్బంధం
  • జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్యను గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • మాజీ మంత్రి కొల్లు రవీంద్రను చిలకల్లు టోల్‌గేట్‌ వద్ద అరెస్టు చేసిన పోలీసులు

11:03 February 21

నా భర్త ఆచూకీ తెలియట్లేదు: టీడీపీ నేత పట్టాభి భార్య చందన

  • నా భర్త ఆచూకీ తెలియట్లేదు: టీడీపీ నేత పట్టాభి భార్య చందన
  • నా భర్తను నిన్న సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు: పట్టాభి భార్య
  • పట్టాభి ఎక్కడ ఉన్నారో ఇంతవరకు ఆచూకీ లేదు: పట్టాభి భార్య చందన
  • పట్టాభిని చూపించకపోతే డీజీపీ ఇంటి ముందు దీక్షకు కూర్చుంటా: చందన

11:01 February 21

గన్నవరం టీడీపీ కార్యాలయం ఘటనలో బాధితులపై కేసులు నమోదు

  • గన్నవరం టీడీపీ కార్యాలయం ఘటనలో బాధితులపై కేసులు నమోదు
  • హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద కేసులు
  • వైఎస్సార్​సీపీ నేతల ఫిర్యాదుతో 60 మందికి పైగా టీడీపీ నేతలు, ఇతరులపై కేసులు
  • గన్నవరం టీడీపీ నేతలు దొంతు చిన్నా, దొంతు రాణి, 30 మందిపై హత్యాయత్నం కేసులు
  • 143, 147, 341, 333, 353, 307, 448, 143, 147, 506, 509 r/w 149 సెక్షన్ల కింద కేసులు
  • పట్టాభి, మరో 16 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు
  • బోడె ప్రసాద్‌తోపాటు మరో 11 మందిపై 353, 143, 147, 149 సెక్షన్ల కింద కేసులు

10:52 February 21

గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడికి టీడీపీ నేతల నిరసనలు

  • చలో గన్నవరం పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ
  • నిన్న పార్టీ కార్యాలయంపై విధ్వంసానికి నిరసనగా టీడీపీ పిలుపు
  • కృష్ణా:టీడీపీ నేతలను గృహనిర్బంధం చేస్తున్న పోలీసులు
  • దేవినేని ఉమా, బొండా ఉమా, బుద్దా వెంకన్న గృహనిర్బంధం
  • నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గృహనిర్బంధం
  • నాగాయలంక పీఎస్‌లోనే నిరసన తెలుపుతున్న బోడె ప్రసాద్
  • గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఉన్న బోడె ప్రసాద్‌ను అరెస్టు చేసిన పోలీసులు
  • అరెస్టును నిరసిస్తూ పోలీసుస్టేషన్‌లోనే నిరసన చేస్తున్న బోడె ప్రసాద్‌
Last Updated : Feb 21, 2023, 9:13 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details