ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలోని అన్న క్యాంటీన్ వద్ద తెదేపా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. క్యాంటీన్ దగ్గర వంటావార్పు కార్యక్రమం చేసి 200 మంది పేదలకు భోజన సౌకర్యం కల్పించారు. తెదేపా ప్రభుత్వం రాష్ట్రమంతా అన్న క్యాంటీన్లు పెట్టి పేదవారి ఆకలి తీరిస్తే.. వైకాపా ప్రభుత్వం వచ్చి.. ఆ క్యాంటీన్లు మూసివేయడం దారుణమన్నారు. ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్న క్యాంటీన్లను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.
'అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించండి' - కృష్ణా జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర తాజా వార్తలు
కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెదేపా నేతలు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. అన్న క్యాంటీన్ వద్ద వంటావార్పు చేపట్టారు. 200 మంది పేదలకు భోజన సౌకర్యం కల్పించారు. క్యాంటీన్లను వెంటనే తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
అవనిగడ్డలో తెదేపా నేతలు ప్రజా చైతన్య యాత్ర