ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెలుగువాడు ప్రధాని కావాలనే...పీవీకి పోటీకి నిలబెట్టలేదు' - tdp latest news

అమరావతి తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో నేతలు పీవీ.నర్సింహారావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం కోసం నూతన సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. తెలుగువాడు ప్రధాని కావాలనే ఉద్దేశంతోనే నంద్యాల పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదని గుర్తు చేశారు.

tdp leaders
పీవీ.నర్సింహారావు వర్ధంతి కార్యక్రమం

By

Published : Dec 23, 2020, 6:01 PM IST

Updated : Dec 23, 2020, 8:02 PM IST

తెదేపా కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్​లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 16వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పలువురు నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం కోసం నూతన సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు.

తెలుగువాడు ప్రధాని కావాలని నంద్యాల పార్లమెంట్​కు జరిగిన ఉప ఎన్నికల్లో పీవీపై తెదేపా తరఫున ఎన్టీఆర్ అభ్యర్థిని పోటీకి పెట్టలేదని నేతలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు కొమ్మారెడ్డి పట్టాభి, గురజాల మాల్యాద్రి, ఏవీ రమణ, సయ్యద్ రఫీ, దారపనేని నరేంద్ర, వల్లూరి కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.

Last Updated : Dec 23, 2020, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details