ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గెలుపే పరమావధిగా ప్రతి కార్యకర్త పని చేయాలి' - నెట్టెం రఘురాం న్యూస్

పంచాయతీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక శక్తిలా పనిచేయాలని... విజయవాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం అన్నారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి... పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు.

tdp meeting
తెదేపా కార్యకర్తల సమావేశం

By

Published : Jan 27, 2021, 2:00 PM IST

పంచాయతీ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా ప్రతీ ఒక్కరూ పనిచేయాలని విజయవాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో తంబరేణి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ప్రతి కార్యకర్త ఒక శక్తిలా పని చేసి తెలుగుదేశం పార్టీ గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్లను అభ్యర్థులను గెలిపించి వైకాపా నేతలకు బుద్ధి చెప్పాలన్నారు. నామినేషన్ సమయంలో ఎటువంటి విఘాతం కలిగినా.. ఎలక్షన్ కమిషన్ వారికి ఇతర అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యకర్తలు పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details