ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఈసీ గారూ! రాళ్ల దాడిపై పూర్తి నివేదిక తెప్పించండి: వర్ల - తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి కేసులో పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర తెదేపా లేఖ రాసింది. సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో ఏపీ పోలీసుల ప్రమేయం లేకుండా పూర్తిగా కేంద్ర బలగాల పర్యవేక్షణలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

సీఈసీ గారూ! రాళ్ల దాడిపై పూర్తి నివేదిక తెప్పించండి : వర్ల
సీఈసీ గారూ! రాళ్ల దాడిపై పూర్తి నివేదిక తెప్పించండి : వర్ల

By

Published : Apr 14, 2021, 8:40 PM IST

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెదేపా అధినేత చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటనపై పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా కోరినట్లు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో స్థానిక పోలీసుల ప్రమేయం లేకుండా కేంద్ర బలగాలనే నియమించాలని కోరామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు సహా లైవ్ చూసేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల ప్రదాన కమిషనర్​కు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

ఓటర్​ సహా మరో గుర్తింపును పరిశీలించాలి..

నకిలీ ఓటర్ ఐడీ కార్డులు దాదాపు 2 లక్షలు ఉన్నాయన్న అనుమానం తాము వ్యక్తం చేశామని.. ఓటర్ కార్డుతో పాటు మరో గుర్తింపు కార్డుని కూడా పరిశీలించాలని కోరినట్లు వివరించారు. వైకాపాకు కరుడుగట్టిన అభిమానంతో ఉన్న కొందరు పోలీస్ అధికారుల వాహనాల్లోనూ డబ్బు తరలిస్తున్నారని పేర్కొన్నారు.

నిందితులను వెంటనే పట్టుకోవాలి..

చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటనలో డీఐజీ క్రాంతి రాణా తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని, రాళ్లు విసిరిన నిందితులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి : మొన్న రాళ్లదాడి చేశారు.. ఇవాళ కరెంట్ నిలిపేశారు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details