ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విజయసాయి రెడ్డి విశాఖ కేజీహెచ్​లో ఎందుకు చేరలేదు' - విజయసాయిరెడ్డికి కరోనాపై వార్తలు

కరోనా పాజిటివ్ వచ్చిన విజయసాయి రెడ్డి విశాఖ కేజీహెచ్​లో ఎందుకు చేరలేదని తెదేపా నేతలు ప్రశ్నించారు. వైకాపా నాయకులకు హైదరాబాద్​లో కార్పొరేట్ వైద్యం, ప్రజాలకేమో పులిహోర ప్యాకెట్ల వైద్యమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp leaders fires on vijaya sai reddy  on corona
తెదేపా నేతలు

By

Published : Jul 22, 2020, 11:46 AM IST

విజయసాయిరెడ్డి కరోనా పాజిటివ్ రాగానే ప్రత్యేక విమానంలో వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎందుకు పారిపోయారని తెలుగుదేశం నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలు నిలదీశారు. అచ్చెన్నాయుడు అంశంలో విజయసాయి ఘోరంగా అవమానించారని పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉన్నా ఈ డ్రామాలేంటి అచ్చన్నా.., కార్పొరేట్ ఆస్పత్రి కావాలా, ఈఎస్ఐ వద్దా అంటూ సాయిరెడ్డి ట్వీట్లు పెట్టి హింసించారు. మరి ఇప్పుడు వైకాపా నాయకులకు హైదరాబాద్​లో కార్పొరేట్ వైద్యం, ప్రజాలకేమో పులిహోర ప్యాకెట్ల వైద్యమా. ఏ గుండ్రాయిలా ఉన్న సాయిరెడ్డి విశాఖ కేజీహెచ్​లో ఎందుకు చేరలేదు ' - అయ్యన్నపాత్రుడు

ఏపీలో అల్లుడు వైద్యం మీద నమ్మకం లేదా అని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. అల్లుడు పాలన మీద విజయసాయికి నమ్మకం లేదా అని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నిలదీశారు.

'గుండ్రాయిలా ఉన్న అచ్చెన్నకి కార్పొరేట్ వైద్యం ఎందుకు ఈఎస్ఐ ఉండగా అని ఒక బీసీ నాయకుడిని అవమానిస్తూ మీ రాక్షస మనస్తత్వం బయటపెట్టారు. విజయసాయికి కరోనా పాజిటివా లేక వివేకా కేసులో సీబీఐ పాజిటివా. ఆయన హత్యకు గురైనప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురైయ్యారు గుర్తుందా?' - బుద్దా వెంకన్న

ఇదీ చదవండి: ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..!

ABOUT THE AUTHOR

...view details