TDP Leaders Fired on Jagan Government : పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా విలువైన జలాలు వృథా అవుతున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమశిల జలాల వృథా, ఇరిగేషన్ లో వందల కోట్ల నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో లక్ష ఎకరాలకు 35 టీఎంసీల నీరు వృథా అయితే నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖలు ఏమి చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో నీటిపారుదల, వ్యవసాయ శాఖలు అదుపు తప్పాయని ఆరోపించారు. టీడీపీ హయాంలో నీరు లేకున్నా ఎగువ ప్రాంతాల నుంచి తరలించి రైతుల అవసరాలు తీర్చామని చెప్పారు. కాలువల పూడిక పేరుతో పెద్ద ఎత్తున నిధులు కాజేశారని విమర్శించారు. దోపిడీ డబ్బు లెక్కించుకోవడం తప్ప రైతుల గురించి వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్ఎస్ఆర్జీ లెక్కల వివరాలు సమాచారం హక్కు చట్టం కింద అడిగినా ఇవ్వడం లేదని తెలిపారు. లస్కర్లకు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని విమర్శించారు. జిల్లాలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ కు లేదా అని ప్రశ్నించారు. మంత్రులు అంబటి, కాకాణి కలిసి నెల్లూరు జిల్లాను ముంచేశారని, ముఖ్యమంత్రి విచారణ జరిపించి వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Farmers not Received Compensation: ప్రాజెక్టు పూర్తై 14 ఏళ్లవుతున్నా.. రైతులకు న్యాయం జరగలేదు..
నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ భ్రష్టు పట్టాయి. నెల్లూరు జిల్లాలో దాదాపు 5.5లక్షల ఎకరాలు సోమశిల, 2.5లక్షల ఎకరాలు తెలుగుగంగ కింద మొత్తం 8లక్షల ఎకరాలు వరి సాగవుతుంది. మే 1వ తేదీ నాటికి 50.9టీఎంసీల నీరు ఉంటే 2.85వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, లక్ష ఎకరాలకు 35టీఎంసీలు కాజేశారంటే.. ఈ జిల్లాలో మంత్రి ఉన్నాడా..? నీటిపారుదల, వ్యవసాయ శాఖలు ఏం చేస్తున్నాయి.? -సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత, మాజీమంత్రి