ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అసలు వాస్తవాలు ప్రభుత్వం బయటపెట్టాలి' - TDP leaders latest comments on government

రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. శాసనసభపక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి, తెదేపా అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్​లు.. కరోనా పరిస్థితిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. టీవీల్లో తప్ప ముఖ్యమంత్రి బయట కనిపించరా అని నిలదీశారు.

ప్రభుత్వం తీరుపై తెదేపా నేతలు ఫైర్
ప్రభుత్వం తీరుపై తెదేపా నేతలు ఫైర్

By

Published : May 11, 2021, 1:43 PM IST

రుయా ఆసుపత్రిలో జరిగిన సంఘటనకు సంబంధించిన అసలు వాస్తవాలను ప్రభుత్వం బయటపెట్టాలని తెదేపా అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెప్తున్న మరణాల సంఖ్యపై అనేక అనుమానాలున్నాయన్నారు. సంఘటన జరిగిన సమయంలో మొత్తం 135 మంది రోగులు ఆసుపత్రిలో ఉన్నారన్న ఆయన.. వారికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విజయనగరం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆక్సిజన్ లేక రోగులు చనిపోయిన ఘటనలను పరిగణనలోకి తీసుకొని.. నివారణ చర్యలు చేపట్టి ఉంటే రుయా విషాదం జరిగి ఉండేది కాదన్నారు. రుయా ఘటనలో ఎవరిపై కేసు పెట్టాలో సజ్జల సెలవివ్వాలని ఆయన నిలదీశారు.

రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని తెదేపా శాసనసభపక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ఘోరంగా ఉంటే ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కుక్క తోక వంకర అనే రీతిలో విపత్కర పరిస్థితుల్లో పాలనను గాలికొదిలి కమీషన్లపై దృష్టి పెట్టారని దుయ్యబట్టారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details