ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP leaders Fire on CM Jagan: సీఎంకు తెలియకుండానే చంద్రబాబు అరెస్టు జరిగిందా..! ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకే జగన్ నాటకాలు: టీడీపీ - గంటా శ్రీనివాసరావు

TDP leaders Fire on CM Jagan: చంద్రబాబు అరెస్ట్​పై జగన్ పిల్లి మొగ్గలు వేస్తున్నారని, తాను లండన్ వెళ్లినపుడు అరెస్టు చేశారని చెప్తూ ప్రజాగ్రహం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడమంటే.. పార్టీ అధినేత చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపినంత తేలిక కాదన్న విషయం జగన్ గుర్తించాలని అన్నారు.

tdp_leaders_fire_on_cm_jagan
tdp_leaders_fire_on_cm_jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 7:34 PM IST

TDP leaders Fire on CM Jagan : తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడమంటే.. పార్టీ అధినేత చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపినంత తేలిక కాదన్న విషయం జగన్ గుర్తించాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర హితవు పలికారు. చంద్రబాబు అరెస్ట్ విషయం తనకు తెలియదని సీఎం జగన్ చెప్పడం అతడి మానసిక స్థితికి నిదర్శనమని మండిపడ్డారు.జగన్​లోని సైకోయిజానికి తోడు పిచ్చికూడా బాగా ముదిరినట్టుందనిఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్​పై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాల నుంచి తప్పించుకోవడానికే జగన్ నంగనాచి కబుర్లు చెబుతున్నాడని దుయ్యబట్టారు. సామాజిక బస్సుయాత్రలు చేసే ముందు ఎస్సీ, ఎస్టీ బీసీల సబ్ ప్లాన్ నిధులు 1,14,000కోట్లు ఏమయ్యాయో జగన్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నాలుగున్నరేళ్లుగా ప్రజల్ని నాసిరకం మద్యానికి బానిసల్ని చేసి, వారి ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసిన జగన్ రెడ్డి.. ‘సురక్షతో వారిని కాపాడతాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 వేల మంది కల్తీమద్యం వల్ల చనిపోయాక.. జగన్​కు పేదల ఆరోగ్యం గుర్తొచ్చిందా అని నిలదీశారు. ఏపీ నీడ్స్ జగన్ కాదు... ఏపీ హేట్స్ జగన్ (AP Hates Jagan) అనేదే ప్రజలందరి మాట అని స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో క్రీడల్ని, క్రీడాకారుల్ని పట్టించుకోని జగన్ నేడు క్రీడాశాఖలోని నిధుల్ని కాజేయడానికే ఆడదాం.. పాడదాం అంటున్నాడని ఆరోపించారు.

Nara Lokesh on Bandaru Arrest: వైసీపీకి ఓ చట్టం.. విపక్షాలకు మరో చట్టమా..? బండారు అరెస్ట్‌పై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం

జగన్ జోకులు బాగా చెప్పారు... విజయవాడలో జరిగిన వైసీపీ నాయకుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ జోకులు బాగా చెప్పారని గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు క్షేమంగా జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) విశాఖలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచరపాలెంలోని సిద్ధ ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబుకి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదని, తాను లండన్ లో ఉన్నానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజలెవరూ జగన్ మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. టీడీపీ, జనసేన నాయకులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

TDP Leader Ashok Babu on Jagan Bail భవిష్యత్తులో జగన్, కేబినెట్ మొత్తం జైలుకెళ్లడం ఖాయం: టీడీపీ నేతలు

టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరు.. చంద్రబాబును అరెస్ట్(Chandrababu arrest) చేయించడానికే ప్రణాళిక ప్రకారం కుట్రలు పన్ని ముఖ్యమంత్రి జగన్ లండన్ వెళ్లారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. ఇపుడేమో తాను లండన్ వెళ్లిన తర్వాత అరెస్ట్ చేశారు.. తనకు తెలియదని బుకాయించడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని కుట్రలు పూర్తి చేసి ఆధారాలు లేని కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయించిన ముఖ్యమంత్రి.. ఇపుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న కారణంగా సానుభూతి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును జైల్లో పెట్టి బస్సుయాత్రలు చేయడానికి జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారన్న ఆయన... ఎన్ని యాత్రలు చేసినా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కడప నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించామని కడప ఇన్ ఛార్జి మాధవిరెడ్డి తెలిపారు.

TDP Vs YSRCP: చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదు: టీడీపీ నేతలు

జనసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు తథ్యం.. చంద్రబాబు అరెస్ట్ గురించి జగన్ తనకు తెలియదని చెప్పడం హాస్యాస్పదమని తెలుగుదేశం సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. జగన్ ఆస్తులు ప్రకటించి తన నిజాయతీ నిరూపించుకోవాలని అన్నారు. అన్యాయంగా టీడీపీ నేతలపై కేసులు(Cases against TDP leaders) పెట్టాలని చూస్తున్నారని, వంద రోజుల్లో ఆయన ఎక్కడ ఉంటారో జగన్ లెక్కేసుకోవాలని చెప్పారు. జగన్ కేసులకు భయపడేది లేదని, పవన్ కల్యాణ్​తో కలిసి బలమైన ప్రభుత్వాన్ని నిర్మిస్తామని చెప్పారు. మంత్రి రోజా గురించి తెలుసు కాబట్టి వైసీపీ సోదరసోదరీమణులు ఎవరూ స్పందించడం లేదని సత్యనారాయణమూర్తి అన్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద నారా భువనేశ్వరిని కలిసి తన మద్దతు తెలిపారు.

TDP Bus Yatra: భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్రతో.. వైసీపీ వెన్నులో వణుకు..: టీడీపీ నేతలు

ABOUT THE AUTHOR

...view details