ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అసెంబ్లీలో ఎదుర్కోలేక  అచ్చెన్నాయుడిని  అరెస్ట్ చేశారు' - అచ్చెన్నాయుడు అరెస్టు వార్తలు

మాజీ మంత్రి , తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్టుపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆయనను కావాలనే అరెస్టు చేశారని విమర్శించారు. శాసనసభలో అచ్చెన్నాయుడిని ఎదుర్కోలేక ఈ చర్యలకు పాల్పడ్డారని పంచుమర్తి అనురాధ ఆరోపించారు.

anuradha tdp
anuradha tdp

By

Published : Jun 12, 2020, 3:03 PM IST

తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుపుతోందని దుయ్యబట్టారు. బడుగు బలహీనవర్గాలంటే సీఎం జగన్​కు ఎంత కక్ష ఉందో దీనిని బట్టే స్పష్టమైందని మండిపడ్డారు. శాసనసభలో అచ్చెన్నాయుడిని ఎదుర్కోలేక ఈ చర్యకు ఒడిగట్టారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details