ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీసీలకు ఎవరేం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా..?: దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర - Tainted police officers

Tdp leaders fire on government : గొడ్డలి పోటుని గుండెపోటుగా చిత్రీకరించిన సజ్జలా.. విలువల గురించి మాట్లాడేది అని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. బూతుల్లో డిస్టింక్షన్ సాధించిన మంత్రుల్ని పక్కన పెట్టుకుని నీతి సూత్రాలు వెల్లడించడం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పైశాచకత్వం పరాకాష్టకు చేరిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

టీడీపీ నేతలు ఉమ, కొల్లు
టీడీపీ నేతలు ఉమ, కొల్లు

By

Published : Feb 22, 2023, 7:36 PM IST

Tdp leaders fire on government : గొడ్డలి పోటుని గుండెపోటుగా చిత్రీకరించిన సజ్జలా.. విలువల గురించి మాట్లాడేది అని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. పింక్ డైమండ్ గురించి అసత్యాలు మాట్లాడింది ఎవరని నిలదీశారు. బూతుల్లో డిస్టింక్షన్ సాధించిన మంత్రుల్ని పక్కన పెట్టుకుని నీతి సూత్రాలు వెల్లడించడం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పైశాచకత్వం పరాకాష్టకు చేరిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఒక బీసీ నాయకుడు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడమేనా బీసీల పట్ల చూపించే చిత్తశుద్ధి అని దుయ్యబట్టారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం చేసి, 26మంది బీసీ నాయకుల్ని చంపించటం వాస్తవం కాదా..? అని నిలదీశారు. ధైర్యముంటే బీసీలకు ఎవరేం చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

టీడీపీ నేతలు ఉమ, కొల్లు

రాష్ట్రంలో కొంతమంది కళంకిత పోలీస్ అధికారులు వైఎస్సార్సీపీ అనుచరులుగా దిగజారి పనిచేస్తున్నారు. పట్టాభి కిడ్నాప్ వ్యవహారం మొత్తం సీఎంఓ కార్యాలయం, సజ్జల రామకృష్ణారెడ్డి, రఘురామరెడ్డి డైరెక్షన్ లో జరిగింది. పట్టాభిని భయపెట్టాలనుకున్నారు.. ప్రభుత్వం అవినీతి, అరాచకత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే ఉద్దేశంతోనే టార్గెట్ చేశారు. కారుపై దాడి జరిగినా, ఇంటిపై దాడి జరిగినా ఇంతవరకు అరెస్టుల్లేవు. పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరిగినా అరెస్టుల్లేవు. చంద్రబాబు నాయుడు ఇంటిపైకి దాడికి వచ్చిన వారు.. క్యాబినెట్ మినిస్టర్లు అయ్యారు.. మాచర్లలో పార్టీ ఆఫీస్ పై దాడి చేశారు. మళ్లీ గన్నవరంలో హింసాకాండకు పాల్పడ్డారు. బచ్చుల అర్జునుడు ఆస్పత్రిలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే.. రెండు సార్లు బీ ఫాం ఇచ్చిన కన్నతల్లి లాంటి పార్టీ ఆఫీస్ పై వంశీ దాడులకు పాల్పడి, స్వైర విహారానికి పాల్పడడం అమానుషం. - దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి

గన్నవరంలో హింసాకాండ జగన్ మోహన్ రెడ్డి పైశాచికత్వం, ప్రభుత్వ పతనానికి పరాకాష్ట. ఒక బీసీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టే హక్కు, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు లేదా..? దొంతు చిన్నా చేనేత వర్గానికి చెందిన బీసీ వ్యక్తి. ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నం చేస్తే.. కార్యాలయంపైకి కార్యకర్తల్ని ఉసిగొల్పితే.. జగన్ మోహన్ రెడ్డి చేస్తే.. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేస్తే అంతగా టీడీపీ గ్రాఫ్ పెరుగుతుంది. 26 మంది బీసీలను పొట్టన పెట్టుకున్నవే.. వారందరినీ హత్య చేశావే.. ఇంకా నీ కడుపు చల్లారలేదా..? - కొల్లు రవీంద్ర, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details