ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా రోగుల మృతికి నివాళిగా.. తెదేపా నేతల కొవ్వొత్తుల ప్రదర్శన - candles-display-to-tribute-corona-patients-deaths

కరోనా రోగుల మృతికి నివాళిగా తెదేపా నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇళ్ల వద్దే నిరసనలు చేపట్టారు.

tdp-leaders-conduct-candles-display-to-tribute-corona-patients-deaths
కరోనా రోగుల మృతికి నివాళిగా తెదేపా నేతల కొవ్వొత్తుల ప్రదర్శన

By

Published : May 12, 2021, 9:27 PM IST

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో 8,889మంది కరోనా రోగులు చనిపోయారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో కోవిడ్ ఉద్ధృతి దృష్ట్యా అత్యవసర ఆరోగ్య పరిస్థితి ప్రకటించి, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యంతోనే కరోనా బాధితులు చనిపోయారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, యువనేత రవి నాయుడు మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details