కృష్ణా జిల్లా కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని కృష్ణాజిల్లా తెదేపా నేతల బృందం కలెక్టర్ జె.నివాస్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి తెదేపా నిజనిర్దరణ కమిటీ కొండపల్లి అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్తుందని నేతలు వెల్లడించారు. రెవెన్యూ, అటవీ, మైనింగ్ మూడు శాఖల నుంచి ముగ్గురు అధికారులను తమ వెంట పంపాలని కలెక్టర్‌ను కోరారు. తమ వెంట అధికారులు లేకపోతే.. ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ తమపై రౌడీయిజం చేసే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, విజయవాడ పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు నెట్టెం రఘురాం వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.
వర్ల రామయ్య
అక్రమ వర్ల రామయ్యం మైనింగ్ పరిశీలించి చంద్రబాబుకి నివేదిక అందచేస్తామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్ టీమ్ పంపిస్తే వారి వెంట వెళతామని...లేకపోతే తామే వెళతామని నేతలు స్పష్టంచేశారు. ఉమాపై వైకాపా గుండాలు దాడి చేసి ఆయనపైనే ఎదురు కేసులు పెట్టడం దుర్మార్గమని నేతలు ధ్వజమెత్తారు.