ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా కొల్లగొట్టిన నల్లధనం.. చెన్నై మీదుగా మారిషస్ చేరుతోంది'

రాష్ట్రంలో కొల్లగొట్టిన కోట్ల కొద్దీ నల్లధనాన్ని.. వైకాపా నేతలు ఎమ్మెల్యే స్టిక్కర్లు అతికించి కార్లలో చెన్నైకి చేరవేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. తమిళనాడులో కారులో దొరికిన డబ్బుతో ఈ విషయం బయటపడిందన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన డబ్బును తరలిస్తూ.. పట్టుబడ్డ నల్లధనంపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

tdp leaders
tdp leaders

By

Published : Jul 18, 2020, 10:11 PM IST

తమిళనాడులో ఎమ్మెల్యే స్టిక్కర్​తో ఉన్న కారులో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి తరలిస్తూ పట్టుబడ్డ నల్లధనంపై సీఎం ఎందుకు స్పందించటం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ప్రశ్నించారు. వైఎస్ కుటుంబ సభ్యుల పేర్లతో చైన్నైలో ఒకే ఇంటి అడ్రస్ తో మూడు సూట్ కేస్ కంపెనీలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిధులు తరలిస్తున్న విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. విజయసాయిరెడ్డి డైరెక్షన్ లో సూట్ కేస్ కంపెనీలు సృష్టించి నిధులు తరలిస్తున్నారని ఆరోపించారు.

జగన్ అధికారం చేపట్టిన తరువాత వర్క్ ఈజ్ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని 20 సెప్టెంబర్ 2019న రిజిస్టర్ చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో కొల్లగొట్టిన నల్లధనాన్ని వైకాపా నేతలు చెన్నై తరలిస్తున్న విషయం బయటపడిందని అన్నారు. ఆ డబ్బు చెన్నై నుంచి హవాలా మార్గంలో మారిషస్ కు వెళ్ళేది నిజమేనని ఇప్పుడు తేలాల్సి ఉందన్నారు.

చెన్నైలో ఒకే అడ్రస్ తో ఉన్న ఫారెస్ ఇంపెక్స్, క్వన్నా ఎగ్జిమ్, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీలకు వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ భారతీ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డిలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. హవాలాకు కేంద్రంగా ఉన్న వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ సంస్థ రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన ఇ-మెయిల్ అడ్రస్ వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిదని లోకేశ్ ఆరోపించారు. ఈ మొత్తం విషయంపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

సెప్టెంబర్ సగం ముగిసేసరికి తీవ్ర స్థాయికి కరోనా!

ABOUT THE AUTHOR

...view details