ఊరందరికీ వైరస్ అంటించి.. తాను అంటించుకున్నారని విజయసాయిరెడ్డిపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు విమర్శనాస్త్రాలు సంధించారు. కడపలో సీబీఐ దిగేసరికి కొవిడ్ టెస్ట్ నెగెటివ్ వచ్చినా.. పాజిటివ్ అంటూ అల్లుడి పాలనలో వైద్యం మీద నమ్మకంలేక తెలంగాణకి వెళ్లి అపోలోలో చేరారని దుయ్యబట్టారు. సీబీఐ విచారణకు విశ్రాంతి అనేసరికి మళ్లీ కోవిడియట్ అవతారమెత్తి వైరస్ వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు సై అంటే కరోనా అంటూ కపటనాటకాలెందుకు: అయ్యన్నపాత్రుడు - తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు వార్తలు
కడపలో సీబీఐ దిగేసరికి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కొవిడ్ నెగిటివ్ వచ్చినా.. పాజిటివ్ అంటూ తెలంగాణలోని ఆస్పత్రిలో చేరారని తెదేపా నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. అమరావతికి మద్దతుగా చంద్రబాబు రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డే కదా డిమాండ్ చేసింది అని గుర్తుచేశారు. తీరా చంద్రబాబు సై అంటే కరోనా అంటూ కపటనాటకాలెందుకని ఆక్షేపించారు.
tdp leaders
"ఇంట్లో ఒంటరిగా ఉండడం వల్ల చిన్నమెదడేమన్నా చితికిపోయిందేమో.. అమరావతికి మద్దతుగా దమ్ముంటే చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది విజయసాయిరెడ్డే కదా. తీరా చంద్రబాబు సై అంటే కరోనా అంటూ కపటనాటకాలెందుకు. అంత ప్రజాబలం ఉంటే 151 మంది రాజీనామాలు చేయాలి. కరోనా తగ్గాకే ఈసీ ఎన్నికలు జరుపుతుంది" - తెదేపానేతఅయ్యన్నపాత్రుడు
ఇదీ చదవండి:అత్యున్నత పరీక్షలో ఉన్నతంగా.. నిలిచి గెలిచిన తెలుగు తేజాలు..!
Last Updated : Aug 5, 2020, 12:33 PM IST