TDP Leaders Comments on Police Cases: వైసీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. మా పైనే ఎస్సీ, ఎస్టీ కేసులా.. టీడీపీ నేతలు TDP Leaders Comments on Police Cases:యువగళం పాదయాత్రలో భాగంగా రంగన్నగూడెంలో జరిగిన ఘర్షణలో తమ నేతలపై అక్రమంగా హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసినందుకు వెళ్లిన తమపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన వింత పోకడ ఈ సైకో పాలనలో చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పోలీసులు 50 మందిపై అక్రమ కేసులుపెట్టారని విమర్శించారు. అమెరికాలో ఉన్న నాయకులపైనా తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు. జగన్ కళ్లల్లో ఆనందం చూడటానికి ఇంట్లో మహిళల్ని కించపరుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం తెదేపా ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ని ఏ1 గా చేర్చుతూ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా తెలుగుదేశం నేతలు దేవినేని ఉమా, కొల్లురవీంద్ర, కొనకళ్ల నారాయణలపైనా కేసులు నమోదు చేశారు. గన్నవరం తెలుగుదేశం కీలక నేతలే లక్ష్యంగా పోలీసులు కేసులు నమోదు చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Petition in High Court on Punganur Incident: సంఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు.. ప్రాథమిక ఆధారాలున్నాయి: హైకోర్టు
Police Registered Cases Against TDP Leaders Speeches:యువగళం పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగాలకు సంబంధించి తెలుగుదేశం నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సభ వేదిక నుంచీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారంటూ ఆత్కూరు పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ఫిర్యాదు మేరకు టీడీపీ సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై విడివిడిగాకేసులు నమోదు చేశారు. రంగుల రాణి రోజా మేకప్ చూస్తే రాత్రులు కూడా భయమేస్తుందంటూ అంటూ చేసిన వ్యాఖ్యలకు, ముఖ్యమంత్రిని ఆర్ధిక ఉగ్రవాది, సైకో, ధన పిశాచి, అంటూ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153a, 354A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా.. బుద్దా వెంకన్న పై 153, 153a, 505(2), 506ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి.
YSRCP Attacks: నన్ను ఎమైనా అంటే నా అభిమానులకు బీపీ పెరుగుతుంది.. 'వైసీపీ దాడులపై' జగన్తీరు
SC, ST Atrocity Cases Against TDP Leaders:యార్లగడ్డ ఇన్‌ఛార్జ్‌గా వచ్చిన 24 గంటల్లో 3 కేసులు పెట్టించాడంటే వల్లభనేని వంశీ ఎంత పిరికివాడో అర్ధమవుతోందని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో బ్లాక్మెయిల్ చేసే కుట్రలో భాగంగానే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో మమ్మల్ని ఎదుర్కోలేని ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కేసులతో సంస్కార హీనులుగా మిగిలిపోతున్నారని.. వీటికి తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. యువగళం పాదయాత్రపై కొడాలినాని, వంశీ పన్నుతున్న కుట్రలపై కృష్ణ జిల్లా ఎస్పీకి ముందుగానే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఉమా విమర్శించారు.
YSRCP anarchists: అరాచకాల అడ్డా.. నేరాల గడ్డ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇన్ని దారుణాలా..!
Kollu Ravindra Comments on YCP Leaders:స్వార్ధం కోసం కొడాలి నాని జగన్‌కి కూడా ద్రోహం చేస్తాడని.. అతను ఓ జిత్తులమారి నక్క అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఓటమి భయం వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. బీసీలు పెయిడ్ ఆర్టిస్టులంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తమ మీద కేసులు పెడితే భయపడే పరిస్థితి లేదని స్పష్టంచేశారు. రంగన్నగూడెంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. వీరందరిలో పేర్ని నాని ఓ బందరు పిచ్చోడని ఎద్దేవా చేశారు. ఉమ్మడి కృష్ణ జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాల్లో వైసీపీకు కనీసం డిపాజిట్ లేకుండా తెలుగుదేశం దెబ్బ అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.