ఏడాది క్రితం 'ఫ్యాన్' ప్రభంజనం సృష్టించి చరిత్ర తిరగరాసిందని చెప్పుకుంటున్న వైకాపా నాయకులు చరిత్రలో 'ఫ్యాన్' వేసుకోలేని పరిస్థితి వచ్చిందని గ్రహించాలని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి దుయ్యబట్టారు. సంవత్సర కాలం వైకాపా పాలన తమ వాళ్ల ఆలనకే సరిపోయిందని విమర్శించారు. ప్రస్తుత పరిపాలన చుక్కాని లేని నావలా ఉందని ఆరోపించారు. జగ'మేత' చారిత్రక తప్పిదానికి ఏడాది అయిందని దుయ్యబట్టారు.
'ప్రస్తుత పరిపాలన చుక్కాని లేని నావలా ఉంది' - గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజా వార్తలు
వైకాపా పాలన సంవత్సరం అయినందున ప్రభుత్వంపై తెదేపా శ్రేణులు ట్విట్టర్ ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రస్తుత పరిపాలన చుక్కాని లేని నావలా వుందని ఆరోపించారు. ఒక్కఛాన్స్ అని రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టారని నాయకులు ధ్వజమెత్తారు.
ఒక్కఛాన్స్ అని రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. ఇసుకకొరత సృష్టించి దోపిడిచేస్తుడంతో పాటు రైతులకు మద్దతు ధరలేదని మండిపడ్డారు. 158రోజుల పోరులో ప్రజరాజధాని, సాగునీటిప్రాజెక్టులు అటకెక్కటంతోపాటు కరెంట్ ఛార్జీలభారం ప్రజల పై మోపారని ఆక్షేపించారు. కంపెనీలు వెనక్కి పోగా నాసిరకం మద్యం బ్రాండ్లతో దోపిడి జరుగుతుండటమే ఏడాది వైకాపా ఘనత అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైకాపా ప్రభుత్వం ఈఎన్సీ అధికారాలు సీఈకి అప్పచెప్పి దోపిడీకి తెరలేపిందని మండిపడ్డారు. 12నెలల్లో ఎంత కాంక్రీట్ వేసి, మట్టితవ్వి, ఖర్చుపెట్టారో జగన్ చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.
ఇదీచూడండి.ముూడు లాంతర్ల స్తంభం కొత్తగా నిర్మిస్తాం: మంత్రి బొత్స