పంచాయతీ ఎన్నికలపై మాట్లాడుతున్న దేవినేని ఉమ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నామని తెదేపా నేతలు అన్నారు. కేంద్ర బలగాల సాయంతో ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి దేవినేని ఉమ కోరారు. రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరించేలా కొంతమంది వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం, మంత్రులు, కొందరు అధికారుల తీరు.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యంతో అధిక శాతం యువత ఓటు హక్కు కోల్పోతోందని ఆవేదన చెందారు.
'గవర్నర్ జోక్యం చేసుకోవాలి'
రాజ్యాంగంలో ఆర్టికల్ 243కె(3) ప్రకారం ఎస్ఈసీకి కావాల్సిన ఉద్యోగులను ఎన్నికల విధుల్లో హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నర్‌పై ఉందని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. గవర్నర్ జోక్యం చేసుకుని పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను ధిక్కరించడం కోర్టు ధిక్కరణేనని పేర్కొన్నారు. 74, 75 రాజ్యాంగ సవరణలను నిర్లక్ష్యం చేస్తూ.. రాజ్యాంగ ధిక్కారానికి సీఎం జగన్ పాల్పడ్డారని యనమల ఆరోపించారు.
ఇదీ చదవండి:
4 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు