ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లా మినీ మహానాడుకు.. భారీ ఏర్పాట్లు - కృష్ణాజిల్లాలో చంద్రబాబు రోడ్​షో

Mini Mahanadu: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరులో తెలుగుదేశం తలపెట్టిన మినీ మహానాడు సభా వేదిక ప్రాంతంలో... ఆ పార్టీ నేతలు భూమి పూజ చేశారు. మహానాడును విజయవంతం చేసి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం సత్తా ఏమిటో చాటుతామని అన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి పార్టీ అధినేత చంద్రబాబు ప్రయాణించే రోడ్డు మార్గాన్ని పసుపుమయం చేస్తామని తెలిపారు. గుడివాడలో చంద్రబాబు రోడ్​షోలో పాల్గొంటారని వెల్లడించారు.

TDP leaders
మినీ మహానాడుకు ఏర్పాట్లు

By

Published : Jun 24, 2022, 10:46 AM IST

Mini Mahanadu: కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరులో జగనున్న ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రబాబు భరోసా కృష్ణాజిల్లా మహానాడు సభ వేదిక ఏర్పాటుకు తెదేపా నాయకులు భూమి పూజ నిర్వహించి, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ జిల్లా తెదేపా నాయకులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి సభావేదిక ఏర్పాట్లను తెదేపా నేతలు ప్రారంభించారు.

మినీ మహానాడుకు ఏర్పాట్లు

మహానాడు విజయవంతంతో కృష్ణా జిల్లాలో తెదేపా సత్తా ఏమిటో ప్రపంచానికి చాటుతామని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి పార్టీ అధినేత చంద్రబాబు ప్రయాణించే రోడ్డు మార్గాన్ని పసుపుమయం చేస్తామని తెలిపారు. గుడివాడలో చంద్రబాబు రోడ్​షోలో పాల్గొంటారని కొల్లు రవీంద్ర చెప్పారు. 29, 30 తేదీల్లో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details