ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజీనామా డ్రామాతో వైకాపా అసలు రంగు బయటపడింది' - ELECTIONS IN TIRURPATHI

వైకాపాపై.. తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. తిరుపతి ఉపఎన్నికలో ఓడిపోతే.. 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని వైకాపా ప్రకటించడం జగన్ రెడ్డి అధికార కాంక్షకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపాపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు మండిపాటు
వైకాపాపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు మండిపాటు

By

Published : Apr 11, 2021, 8:07 PM IST

Updated : Apr 11, 2021, 10:47 PM IST

ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, విశాఖ రైల్వే జోన్ కోసం వైకాపా నేతలు రాజీనామా చేయరని తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓడిపోతే..22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని వైకాపా ప్రకటించడం జగన్ రెడ్డి అధికార కాంక్షకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ సీటుపై ఉన్న ప్రేమ.. రాష్ట్ర సమస్యలపై లేకపోవడం దారుణమన్నారు. రాజీనామా డ్రామాతో వైకాపా అసలు రంగు బయటపడిందని ధ్వజమెత్తారు.

Last Updated : Apr 11, 2021, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details