ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పారాసిటమాల్, బ్లీచింగ్ కలిపి టీకా తయారు చేశారా..?' - ayyannapathrudu fire on YCP leader vijayasai reddy tweet

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన పోస్టుపై తెదేపా నేతలు వ్యంగ్యంగా స్పందించారు. పారాసిటమాల్, బ్లీచింగ్, ఏలూరు నీటిని కలిపి కొవిడ్ టీకా తయారు చేశారా అని ఎద్దేవా చేశారు.

tdp leaders buddha venkanna, ayyannapathrudu
తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న

By

Published : Dec 16, 2020, 7:31 PM IST

Updated : Dec 16, 2020, 8:30 PM IST

డిసెంబర్ 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కోటిమందికి కరోనా వ్యాక్సిన్ అంటూ... వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్​పై తెదేపా నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరోనా వైరస్​కు విజయసాయిరెడ్డి మందు కనిపెట్టారా అని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.

వైకాపా నేత విజయసాయిరెడ్డి మతిపోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆరు నెలల క్రితం ఇస్తామన్న మూడు మాస్కులే ఇవ్వలేని జగన్ ప్రభుత్వం... కరోనా టీకా ఇస్తామంటే ఎలా నమ్మాలని ట్వీట్ చేశారు. పారాసిటమాల్, బ్లీచింగ్, వైకాపా ఏలూరు స్పెషల్ వాటర్ కలిపి కొవిడ్​కు మందు తయారు చేశారా అని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.

ఇదీచదవండి.

ఏలూరు వింత వ్యాధికి పురుగుమందులే కారణం..!

Last Updated : Dec 16, 2020, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details