ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ మచిలీపట్నం కోనేరు సెంటరులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తలపెట్టిన 36 గంటల నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణను నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా... పోలీసులు ముందుగానే గృహ నిర్భందం చేశారు. ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. కుట్రతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని నేతలు ఆరోపించారు.
కొల్లు రవీంద్ర దీక్ష భగ్నం.. నేతల గృహ నిర్బంధం
ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేస్తున్న దీక్షను పోలీసులు కోనేరు సెంటరులో భగ్నం చేశారు. నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా కృష్ణాజిల్లా తెదేపా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
kollu ravindra
Last Updated : Oct 11, 2019, 5:59 PM IST