ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లోటు బడ్జెట్​లో మూడు రాజధానులు ఎలా కడతారు? - capital city agitation in thiruvuru

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ కృష్ణా జిల్లా తిరువూరులో తెదేపా నేతలు ఆందోళన చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

agitation for capital city
రాజధానిగా అమరావతినే కొనసాగించాలి

By

Published : Dec 27, 2019, 4:42 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కృష్ణా జిల్లా తిరువూరులో తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. లోటు బడ్జెట్​లో ఉన్నప్పుడు మూడు రాజధానులు ఎలా కడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రం నిరసనలతో అట్టుడుకుతున్నా ముఖ్యమంత్రికి కనిపించటం లేదా అని ప్రశ్నించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details