ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YARAPATINENI SRINIVAS: 'ఒక్క ఛాన్స్​ అంటూ వచ్చారు.. రెండున్నర లక్షల కోట్లు దోచుకున్నారు!' - ap 2021 news

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్​ రెడ్డి... రెండున్నర లక్షల కోట్లు దోచుకున్నారని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు.

tdp-leader-yarapatineni-srinivas-fires-on-cm-jagan
'ఒక్క ఛాన్స్​ అంటూ వచ్చారు.. రెండున్నర లక్షల కోట్లు దోచుకున్నారు!'

By

Published : Sep 22, 2021, 11:10 AM IST

Updated : Sep 22, 2021, 11:46 AM IST

'ఒక్క ఛాన్స్​ అంటూ వచ్చారు.. రెండున్నర లక్షల కోట్లు దోచుకున్నారు!'

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దొంగాట ఆడుతున్నాయని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్... రెండున్నర లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను ఆదానీకి అమ్మేశారని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరిస్తుంటే ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నీకది,నాకిది అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి కావాల్సిన పని వారు చేసుకుంటున్నారని విమర్శించారు. కర్మాగారం అమ్మకంలో సీఎం జగన్ వాటా ఎంత ఉందో చెప్పాలని యరపతినేని డిమాండ్ చేశారు.

పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజలపై 12 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం వేశారని... మరో 6 వేల కోట్లు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల వారిని జగన్ వంచించారని యరపతినేని ధ్వజమెత్తారు. ఆయన చేస్తున్న దోపిజీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే జోగి రమేశ్​ను చంద్రబాబు ఇంటిపైకి పంపించారని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:విశాఖ జిల్లాలో దివ్యాంగురాలిపై అత్యాచారం

Last Updated : Sep 22, 2021, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details