ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా అవినీతి, అసమర్థ నిర్వాకాలతో రాష్ట్రానికి తీరని నష్టం' - నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2020

సీఎం జగన్ తుగ్లక్ చర్యల వల్లే కేంద్ర బడ్జెట్​లో ఏపికి నిధులు ఇవ్వలేదని తెదేపా నేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. వైకాపా అవినీతి, అసమర్థ నిర్వాకాలతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని విమర్శనాస్త్రాలు సంధించారు.

tdp leader yanamala ramakrishnudu
తెదేపా నేత యనమల రామకృష్ణుడు

By

Published : Feb 1, 2020, 4:17 PM IST

Updated : Feb 1, 2020, 4:32 PM IST

కేంద్ర నిధులు రాబట్టే సామర్థ్యం సీఎం జగన్​లో కొరవడిందని విమర్శించారు తెదేపా నేత యనమల రామకృష్ణుడు. రాష్ట్రంలో గత 8 నెలల్లో అభివృద్ది పనులన్నీ నిలిపివేశారన్న ఆయన.. పోలవరం సహా ప్రాజెక్టుల పనులన్నీ ఆగిపోయాయని ఆరోపించారు. రాజధానికి నిధులు వద్దని ప్రధానికి ఇచ్చిన తొలి వినతిలో జగన్ చెప్పారని ఆక్షేపించారు. పీపీఏలను రద్దు చేయడం సీఎం మొదటి తిక్కపని అని మండిపడ్డారు. ఏపికి వచ్చే పెట్టుబడులన్నీ వెనక్కి పోయాయని ఆరోపించారు. 8నెలల్లోనే లక్షల కోట్ల పెట్టుబడులు పోగొట్టారన్న యనమల... 3రాజధానుల నిర్ణయం ఇప్పుడో తుగ్లక్ చర్య అని విమర్శించారు. సీఎం జగన్‌ 25మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచుతా... నిధులు తెస్తానని గొప్పలు చెప్పారని ఎద్దేవా చేశారు. రెండు కేంద్ర బడ్జెట్​లలో రాష్ట్రానికి ఏమీ రాలేదని... అంతా శూన్యమేనని విమర్శించారు. ప్రభుత్వ నిర్వాకం వల్లే కేంద్ర బడ్జెట్​లో రిక్తహస్తం చూపిందన్నారు. విభజన చట్టం ప్రకారం నిధులు కూడా తెచ్చుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సంజాయిషీ ఇవ్వాలని యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు.

Last Updated : Feb 1, 2020, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details