వైకాపా అరాచక, రాక్షస పాలనకు మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెదేపా నేతలు వ్యాఖ్యానించారు. బుధవారం మూడో విడతలో 2,639 పంచాయతీలకు పోలింగ్ జరగ్గా, రాత్రి 10.30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. 702 పంచాయతీల్లో తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారని తెదేపా నేతలు ప్రకటించారు. వైకాపా బలపర్చిన అభ్యర్థులు 983 చోట్ల గెలుపొందినట్టు పేర్కొన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక బుధవారం రాత్రి మంగళగిరి సమీపంలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు జరిపారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు డప్పులు మోగిస్తూ, బాణసంచా కాలుస్తూ ఆనందోత్సాహాలు ప్రకటించారు.
702 పంచాయతీల్లో మా మద్దతుదారుల విజయం : తెదేపా ప్రకటన - మూడోదశ పంచాయతీ ఎన్నికలు
మూడోదశ పంచాయతీ ఎన్నికల్లో తెదేపా అనూహ్య ఫలితాలు సొంతం చేసుకుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో డబ్బు పంపిణీ చేయడం వల్లే వైకాపా వైకాపా బలపరిచిన అభ్యర్థులు కొంతమంది విజయం సాధించారని ఆరోపించారు.
పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు టీడీ జనార్ధన్, అశోక్‌బాబు, తెలుగురైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, సయ్యద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ‘ఒక్క అవకాశం అని చెప్పి జగన్ తమ నడ్డి విరగ్గొట్టారని తెలుసుకున్న ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో తెదేపా బలపరిచిన అభ్యర్థుల్ని ఎక్కువ చోట్ల గెలిపించారు. వైకాపా పాలనపై ప్రజలకు ముఖం మొత్తింది. ఇది ప్రజాస్వామ్య విజయం. పరిపాలన విధానమంటే ప్రజాస్వామ్యమేనని జగన్ ఇకనైనా గ్రహించాలి. కుప్పంలో కనిపించిన వారందరికీ పది వేలు పంచుతూ అక్రమాలకు పాల్పడ్డారు. దోచుకున్న డబ్బు ఎక్కువైనట్లుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించటం సిగ్గుచేటు. నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు ఇలాగే తెదేపా బలపరిచిన అభ్యర్థ్ధులను గెలిపిస్తారని ఆశిస్తున్నాం’ అని తెదేపా నాయకులు పేర్కొన్నారు.
ఇదీచదవండి.