ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజికవర్గమైతే రైతులకు బేడీలు వేసేవారా? అని తెదేపా నేత వర్ల రామయ్య నిలదీశారు. అమరావతి రైతులకు బేడీలు వేయడాన్ని తప్పుపడుతూ... డీజీపీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ... రైతులకు బేడీలు వేశారని మండిపడ్డారు. ఇది క్షమించరాని నేరమని లేఖలో పేర్కొన్నారు.
'ఎవరి ఆదేశాలతో రైతులకు బేడీలు వేశారు?' - TDP leader varla ramayya latest news
రైతులకు బేడీలు వేసిన ఘటనపై తెదేపా నేత వర్లరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఆదేశాలతో బేడీలు వేశారని మండిపడ్డారు. మరో అధికారితో పునర్విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

తెదేపా నేత వర్లరామయ్య
అందోళన చేస్తున్న అన్నదాతలకు ఎవరి ఆదేశాలతో బేడీలు వేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసు విచారణ తప్పులతడకగా సాగుతోందని, మరో అధికారితో పునర్విచారణ జరిపించాలని కోరారు. తెదేపా రాష్ట్ర నూతన అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనందనలు తెలిపారు.
ఇదీ చదవండి: