ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు తెదేపా నేత వర్ల రామయ్య లేఖ - తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎస్​ఈసీకి లేఖ వార్తలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. నగరపాలక, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాలన్నారు.

Varla Ramaiah's letter to the state election commissioner
రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు తెదేపా నేత వర్ల రామయ్య లేఖ

By

Published : Mar 9, 2021, 9:34 AM IST

నగరపాలక, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాలంటూ.. తెలుగుదేశం నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కోరారు. ఎన్నికల ప్రచారం కోసం మెప్మా గ్రూప్ సభ్యులను వినియోగించుకున్న నర్సీపట్నం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. ఎమ్మెల్యే ప్రచారానికి హాజరు కావాలని ఆడియో క్లిప్పింగ్ పంపిన మిషనరీ మేనేజర్ పైనా చర్యలు తీసుకోవాలని కోరారు. కడప కార్పొరేషన్ 47వ డివిజన్ తెదేపా అభ్యర్థి కొయ్యలకుంట శ్రీనివాసులు నామినేషన్ ను అకారణంగా తిరస్కరించిన రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కొండాపురం మండలం, నెకెనంపేటలోనూ.. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం పెంట్రాల గ్రామంలో 56 మంది రెండు చోట్ల ఓటు వేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై.. సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో రేషన్ వ్యాన్ ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారని.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details