ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి : వర్ల రామయ్య

Varla Ramaiah on Gudivada casino : మంత్రి కొడాలి నానిపై తెదేపా నేత వర్ల రామయ్య మండిపడ్డారు. క్యాసినో నిర్వహించి.. గుడివాడ నగరాన్ని అపవిత్రం చేశాడని ఆరోపించారు. కొడాలి నానికి తక్షణమే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Varla Ramaiah
Varla Ramaiah

By

Published : Jan 23, 2022, 7:47 PM IST

Varla Ramaiah on Gudivada casino : మంత్రి కొడాలి నాని.. గుడివాడ నగరాన్ని అపవిత్రం చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. తక్షణమే అతన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గుడివాడలో క్యాసినో నిర్వహించి.. కృష్ణా జిల్లాలోకి విష సంస్కృతిని తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇది తెలుగు సంస్కృతిపై జరిగిన దాడి అభివర్ణించారు. ఈ విషయం రాష్ట్రమంతటికి, ఇతర రాష్ట్రాలకు తెలిసినా... వైకాపా ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీస్ అధికారులకు తెలియకపోవడం ఆశ్చర్యకరమని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details