విశాఖలో వైకాపా శ్రేణులు చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం దుర్మార్గం, కక్షపూరితమని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్న ఆయన.. నిన్నటి ఘటనతో ప్రభుత్వానికి సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు విశాఖలో అడుగు పెడితే.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన వ్యక్తి ఎవరి బంధువో చెప్పాలని నిలదీశారు. అలా హల్చల్ చేసిన వ్యక్తి మంత్రి బొత్స అనుచరుడు జెట్టి రామారావు అని తెలిపారు. అతని సేవలను మంత్రులు బొత్స, అవంతి శ్రీనివాసరావులు అందుకున్నారా అని ఎద్దేవా చేశారు. బలవన్మరణానికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఘటనపై ప్రభుత్వానికి సంబంధం లేదని ఎలా అంటారు..? - tdp leader varla ramaiah comments against ycp covernment
విశాఖలో నిన్న చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపై తెదేపా నేత వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన అరాచకమన్న ఆయన.. ఈ ఘటనతో ప్రభుత్వానికి సంబంధం లేదని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. నిన్న విమానాశ్రయం వద్ద ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేసిన వ్యక్తి మంత్రి బొత్స అనుచరుడని ఆరోపించారు. పోలీసులు అతనిపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబును ఘటనపై ప్రభుత్వానికి సంబంధం లేదని ఎలా అంటారు..?