ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులు అమ్మఒడికి మళ్లించారు: వర్ల

ఎస్సీ, ఎస్టీ  ఉపప్రణాళిక నిధులను సీఎం జగన్(CM JAGAN) అమ్మఒడికి మళ్లించారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య(Varla Ramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం రూ.5,003 కోట్ల నిధులు అమ్మఒడికి మళ్లించారని ఆరోపించారు. చట్టపరంగా ఎస్సీల నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.

tdp leader varla ramaiah outrage on sc and st funds misuse
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

By

Published : Jul 9, 2021, 10:10 PM IST

ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులను సీఎం జగన్(CM JAGAN) అమ్మఒడి(JAGANANNA AMMAVODI)కి మళ్లించారని తెదేపా నేత వర్ల రామయ్య(Varla Ramaiah) ఆరోపించారు. ఎస్సీ ఉపప్రణాళిక నిధులు రూ. 4,341 కోట్లు, ఎస్టీ ఉపప్రణాళిక నిధులతో మొత్తం రూ.5,003 కోట్ల రూపాయల నిధులు అమ్మఒడి (JAGANANNA AMMAVODI)కి..ప్రభుత్వం మళ్లించిందని వర్ల రామయ్య(Varla Ramaiah) ధ్వజమెత్తారు. గిరిజనులకు కేంద్రం నుంచి వచ్చే జాతీయ ఎస్టీ ఫైనాన్స్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ నిధుల్ని కూడా.. జగన్ రెడ్డి వైఎస్సార్(YSR) పేరు జోడించి సొంత నిధుల్లా... అమ్మఒడి(JAGANANNA AMMAVODI), విద్యాదీవెన,(JAGANANNA VIDYA DEEVENA SCHEME) కానుక(JAGANANNA VIDYA JANUKA)లకు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపప్రణాళిక నిధులతో చంద్రబాబు ఎస్సీ(SC), ఎస్టీ(ST)లకు ఎన్నో రకాలుగా స్వయం ఉపాధి కల్పించారని అన్నారు.

రూ. 4,700కోట్లు మాత్రమే ఖర్చు చేశారు!

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు రూ. 14,367 కోట్లు కేటాయించి.. 90శాతం నిధులు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. జగన్ రెడ్డి 2020-21లో నవరత్నాలకు కేటాయించిన రూ. 7,525 కోట్ల రూపాయలు కూడా కలిపి ఎస్సీ(SC) సంక్షేమానికి రూ. 15వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. కేవలం రూ. 4,700కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరం చెప్తున్న తప్పుడు లెక్కలు విని మోసపోయేందుకు ఎస్సీలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఇకనైనా చట్టపరంగా ఎస్సీలకు నిధులు సక్రమంగా ఖర్చు చేయకుంటే పోరాటం తప్పదని వర్ల రామయ్య హెచ్చరించారు.

ఇదీ చూడండి.

'ఆ ప్రత్యేకాధికారి మా గ్రామంలో కోటి రూపాయల నిధులు కాజేశాడు'

ABOUT THE AUTHOR

...view details