ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓ అభాగ్యురాలి గొంతు వినపడటం లేదా..? - latest political news in vijayawada

ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డిపై తెదేపా నాయకురాలు అనిత ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

tdp leader vangalapudi anitha comments on cm
సీఎంపై ధ్వజమెత్తిన వంగలపూడి అనిత

By

Published : Jun 10, 2020, 10:36 AM IST

దళిత మహిళకు అన్యాయం జరిగితే... దళిత మంత్రులు ఎందుకు నోరువిప్పడం లేదని తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై పిచ్చివారిగా ముద్ర వేయటం దుర్మార్గమని ఆమె మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన చూసి మిగతా నాలుగేళ్ల పరిపాలన ఎలా భరించాలని ప్రజలు అనుకుంటున్నారని ధ్వజమెత్తారు.

నేను ఉన్నాను..నేను విన్నాను అన్న జగన్... ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పాలని నిలదీశారు. మార్చి 22న అనితారాణి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తే ఇప్పుడు సీఐడీకి ఇచ్చి కేసును తారుమారుచేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక అభాగ్యరాలు గొంతు వినబడలేదా అని నిలదీశారు. వైకాపాపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వెంటనే అరెస్టు చేయిస్తున్నారు కానీ, దళిత మహిళకు అన్యాయం జరిగితే ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:'మా గోడు ఎందుకు పట్టించుకోరు?'

ABOUT THE AUTHOR

...view details