వైకాపా ప్రభుత్వం పౌరులకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన చెందారు. విశాఖ పాలీమర్స్ ఘటనపై తప్పు కప్పిపుచ్చుకునేందుకే సాధారణ పౌరులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రూ. 50 లక్షల టన్నుల ఇసుక దోపిడి దందా వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో జరిగిందని ఆయన ఆరోపించారు.
ఉన్నత న్యాయస్థానాలు స్పందించి సూమోటోగా కేసు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ రూ. 2వేల కోట్ల రూపాయలకు పైగా పనులు గత తెదేపా హయాంలో చేస్తే.. ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లింపు చేయలేదన్నారు. రూ. లక్ష 70వేల కోట్లు.. మార్చి 31 వరకు దేనికి ఖర్చు పెట్టారో ప్రభుత్వానికి ధమ్ము ధైర్యం ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బులు దోచుకునేందుకు రివర్స్ టెండరింగ్ డ్రామాలకు తెరతీసారని దుయ్యబట్టారు.