రాష్ట్రంలో పింఛను తీసుకుంటున్నవారికి రూ. 250 పెంచకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండి చెయ్యి చూపించారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మండిపడ్డారు. గడిచిన నెలల పింఛను బాకాయిని సత్వరమే లబ్దిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. వీరులపాడు మండల ప్రజా పరిషత్ అధికారికి వినతిపత్రం అందజేశారు.
కొణతాల పల్లి, పెద్దాపురం గ్రామాల్లో అన్ని అర్హతలు కలిగి ఉండి చేయూత పథకానికి అర్జీలు దాఖలు చేసిన లబ్ధిదారులకు చేయూత అందజేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అందజేసి సుపరిపాలనను అందించాలి కానీ... పార్టీ కాని వారిని అర్హుల జాబితా నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.