ఎన్టీఆర్, పీవీ నర్సింహారావులపై మరోసారి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించక తప్పదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. వారు హిందువులు, ఆంధ్రులని కాదు.. జాతి నాయకులు అని ఆయన స్పష్టం చేశారు. భారతీయులమై.. ఈ మహానుభావులను సంకుచిత దృక్పథంతో చూడటం క్షమించరాని విషయమన్నారు. పీవీ, ఎన్టీఆర్ విషయంలో ఇంత చౌకబారుగా వ్యవహరించడం పొరబాటన్నారు. ఇది రాజకీయం కాదు అరాచకీయమని అని వ్యాఖ్యానించారు.
'మరోసారి తప్పుగా మాట్లాడితే మూల్యం చెల్లించక తప్పదు' - తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న సమాధులను కూల్చేయాలని.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. ఎన్టీఆర్, పీవీ నర్సింహారావులపై మరోసారి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
tdp leader somi reddy