ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును తప్పు బట్టే అధికారం న్యాయస్థానానికి తప్ప సీఐడీకి లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నష్టం జరిగితే ఫిర్యాదు చేయాల్సింది బాధితులే అని అన్నారు. అంతే కానీ ఆళ్ల రామకృష్ణ రెడ్డి కాదని స్పష్టం చేశారు. బాధితులు, లబ్ధిదారులు లేని ఫిర్యాదు క్రిమినల్ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు.
బాధితులు, లాభికులు లేకుండా ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాన్ని సీఐడీ ఎలా తప్పుబడుతుందని నిలదీశారు. అసలు నేరమే లేకుండా తెదేపా అధినేత చంద్రబాబు నేరస్థులు ఎలా అవుతారన్నారని అన్నారు. దురుద్దేశంతో పెట్టిన కేసుకు విచారణ అర్హత ఉందా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.