'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' నినాదంతో తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని విజయవాడ ధర్నా చౌక్‌లో కార్మికులు నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయంతో లక్షలాది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయి.. ఉపాధి కోల్పోయారని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు అన్నారు. సంవత్సర కాలంగా రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నాడు అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా స్వాగతిస్తున్నామని చెప్పి.. నేడు మాట మార్చడం ప్రజలను మోసం చేసినట్లేనని తెదేపా అధికార ప్రనిధి నవనీతం సాంబశివరావు తెలిపారు.
'కుట్రలతో రాజధానిని అమరావతి నుంచి తరలించలేరు'
టీఎన్టీయూసీ కార్మికులు విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టారు. రాజధాని పనులు నిలిచిపోవటంతో లక్షలాది కార్మికులు ఉపాధిని కోల్పోయారని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాజధానిని అమరావతి నుంచి తరలించడం సాధ్యం కాదని తెదేపా అధికార ప్రతినిధి నవనీతం సాంబశివరావు తేల్చి చెప్పారు.
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని
నాడు నేనున్నాను.. విన్నానన్న సీఎం జగన్ నేడు తాడేపల్లి కార్యాలయం నుంచి బయటకు ఎందుకు రావడం లేదన్నారు. విశాఖ ప్రజలు మీ అరాచకాక పాలనకు గతంలో విజయమ్మను ఓడించి సమాధానం చెప్పారని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం పూర్తయితే లక్షలాది కార్మికులకు ఉపాధి దొరికేదనీ.. పనులు ఆగిపోవడంతో లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాజధానిని అమరావతి నుంచి తరలించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: