ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీడీపీ గెలుపు కోసం కలిసికట్టుగా పని చేస్తాం: రావి వెంకటేశ్వరరావు - 2024 సార్వత్రిక ఎన్నికులు

TDP Leader Ravi Venkateswara Rao: కొడాలి నానిని ఓడించటమే ప్రధాన లక్ష్యమని.. అందుకోసం అదిష్ఠానం టికెట్ ఎవరికిచ్చినా టీడీపీ గెలుపు కోసం కలసికట్టుగా పని చేస్తామని ఆ పార్టీ గుడివాడ ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావు తెలిపారు. చంద్రబాబుతో సమావేశమైన రావి.. ఇటీవల అరెస్టులు, తనపై మోపిన అక్రమ కేసులు గురించి వివరించారు. ఇంకా బాగా కష్టపడాలని చంద్రబాబు సూచించారని తెలిపారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 10, 2023, 8:23 PM IST

TDP Leader Ravi Venkateswara Rao: 2024 సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని రావి వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో గుడివాడ పార్టీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు చంద్రబాబుని కలిసి.. కొడాలి నానిపై పలు వ్యాఖ్యలు చేశారు.

గుడివాడ టికెట్ ఎవరికొచ్చినా టీడీపీ గెలుపు కోసం కలసికట్టుగా పని చేస్తామని గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. కొడాలి నానిని గుడివాడ నుంచి ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రవాసాంధ్రులతో సహా అందరూ కలిసి టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు. వెనిగండ్ల రాముకి తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.

కృష్ణా జిల్లా గుడివాడ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. రావి వెంకటేశ్వరరావుతో పాటు మండల పార్టీ, గుడివాడ పట్టణ టీడీపీ నాయకులు భేటీలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. తానే చంద్రబాబుని కలవటానికి సమయం తీసుకున్నానని రావి తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబుని కలిసిన ఆయన.. ఇటీవల అరెస్టులు, తనపై మోపిన అక్రమ కేసులు గురించి వివరించారు. ఇంకా బాగా కష్టపడాలని చంద్రబాబు సూచించారన్నారు. ఈ సందర్భంగా పార్టీ విజయానికి బాగా కష్టపడాలని అధినేత సూచించినట్లు తెలిపారు.

"నేను గతంలో చెప్పాను.. మళ్లీ చెప్తున్నాను. అనేక మంది అనేక రకాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు. కేవలం జగన్​ మోహన్ రెడ్డి, కొడాలి నానిని ఓడించడానికి అనేక శక్తులు పని చేస్తున్నాయి. ఒక్క రావి వెంకటేశ్వరరావు వల్ల కాదు.. అందరి సాయం తీసుకుంటాను. తప్పుడు కేసులు గురించి వివరించాము. "- రావి వెంకటేశ్వరరావు, గుడివాడ టీడీపీ ఇంచార్జ్

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details