వైకాపా నేతలు సుధాకర్ బాబు, రఘురాంలకు నారా లోకేశ్‌ను విమర్శించే అర్హత లేదని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు దుయ్యబట్టారు.
వైకాపా నేతలకు లోకేశ్‌ని విమర్శించే అర్హత లేదు: పిల్లి మాణిక్యరావు - Pilli Manikyarao news
వైకాపా నేతలకు నారా లోకేశ్‌ని విమర్శించే అర్హత లేదని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు దుయ్యబట్టారు. సొంత బాబాయిని చంపించి ఆ నేరం చంద్రబాబుపై నెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని మండిపడ్డారు. దొంగలు, ముఠాకోర్లు, అవినీతి పరులు ఉన్న పార్టీ వైకాపా అని విమర్శించారు

పిల్లి మాణిక్యరావు
"ముఖ్యమంత్రి పదవికోసం తండ్రి శవంతో రాజకీయాలు చేయటంతో పాటు సొంత బాబాయిని చంపించి.. ఆ నేరం చంద్రబాబుపై నెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. దొంగలు, ముఠాకోర్లు, అవినీతి పరులు ఉన్న పార్టీ వైకాపా. జగన్ రెడ్డి అహంకారానికి ఎస్సీల కుటుంబాలు బలవటం సుధాకర్, రఘురాంలకు కనిపించట్లేదా." : పిల్లి మాణిక్యరావు ,తెదేపా అధికార ప్రతినిధి
ఇదీ చదవండి