ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు కులముద్ర వేసి కించపరుస్తున్న సీఎం, మంత్రులు తర్వాత ఎస్ఈసీగా ఏ కులానికీ చెందని వారిని నియమించగలరా? అని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలకు కొవిడ్ గురించి ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు మాస్క్లు పెట్టుకోవట్లేదని నిలదీశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మద్యం దుకాణాలు ఎలా తెరిచారన్నారు. ఎన్నికలకు భయపడి కరోనా సాకులు చెప్తున్నారని విమర్శించారు. మంత్రి కొడాలి నాని భాషను అదుపులో పెట్టుకోవాలని పిల్లి మాణిక్యరావు హితవుపలికారు.
'ఏ కులమూ లేని వ్యక్తిని ఎస్ఈసీగా నియమించగలరా?' - స్థానిక ఎన్నికలపై పిల్లి మాణిక్యాలరావు వ్యాఖ్యలు
ఓడిపోతామన్న భయంతో వైకాపా ఎన్నికలను వ్యతిరేకిస్తోందని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని కులం పేరుతో సీఎం, మంత్రులు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కులానికీ చెందని వ్యక్తిని ఎస్ఈసీగా నియమించగలరా? అని ప్రశ్నించారు.
!['ఏ కులమూ లేని వ్యక్తిని ఎస్ఈసీగా నియమించగలరా?' pilli manikyalarao fires on ysrcp government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9588120-1109-9588120-1605755305791.jpg)
తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు