కాంగ్రెస్‌లో ఉండగా మంత్రులు బొత్స, కన్నబాబు.. సీఎం జగన్పై చేసిన విమర్శలను ప్రజలెవ్వరూ ఇంకా మర్చిపోలేదని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు అన్నారు. వైకాపా చంచల్ గూడ జైలు పార్టీ అన్న కన్నబాబు లాంటి వారికి మంత్రి పదవులెందుకు ఇచ్చారో అందరికీ తెలుసని ఆక్షేపించారు. తన అవినీతిని బయటపెడతారనే భయంతోనే బొత్స, కన్నబాబులకు.. సీఎం జగన్ మంత్రి పదవులిచ్చారని విమర్శించారు.
'అవినీతిని బయటపెడతారనే మంత్రి పదవులిచ్చారు' - వైకాపా ప్రభుత్వంపై పిల్లి మాణిక్యాలరావు కామెంట్స్
సీఎం జగన్ అవినీతి బయటపెడతారనే బొత్స, కన్నబాబులకు మంత్రి పదవులిచ్చారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు. మంత్రులు పదవులు కాపాడుకోవడం కోసం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు
రాష్ట్రంలో సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కొడాలి నాని అసెంబ్లీలో ఏకాపాత్రాభినయం చేశారని ఎద్దేవా చేశారు. మంత్రి పదవులు కాపాడుకోవడం కోసం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని పిల్లి మాణిక్యాలరావు దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: ఏపీ - అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్