ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్తులు కాపాడుకునేందుకే అక్రమ ప్రాజెక్టులపై మౌనం.. ప్రభుత్వ పెద్దలపై పయ్యావుల ఫైర్ - పయ్యావుల కేశవ్

Payyavula keshav : కర్ణాటక నిర్మించే అప్పర్ భద్ర ప్రాజెక్ట్ వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం ప్రశ్నించలేకపోతోందని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆక్షేపించారు. పొరుగు రాష్ట్రాలు చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు జరుగుతున్న అన్యాయం వివరిస్తే... తమను సభ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు. సభ నుంచి సస్పెండ్ చేయగలరేమో కానీ ప్రశ్నించే గొంతును సస్పెండ్ చేయలేరని అన్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 15, 2023, 8:04 PM IST

Payyavula keshav : పొరుగు రాష్ట్రాలు చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు జరుగుతున్న అన్యాయం వివరిస్తే... తమను సభ నుంచి సస్పెండ్ చేశారని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆక్షేపించారు. అసలు ఎందుకు సస్పెండ్ చేశారో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతోందని ఆయన మండిపడ్డారు. సభ నుంచి సస్పెండ్ చేయగలరేమో కానీ ప్రశ్నించే గొంతును సస్పెండ్ చేయలేరని అన్నారు. కర్ణాటక నిర్మించే అప్పర్ భద్ర ప్రాజెక్ట్ వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం ప్రశ్నించలేకపోతోందన్నారు.

ఆస్తులు కాపాడుకునేందుకు ప్రభుత్వ పెద్దల యత్నం... తెలంగాణ రాష్ట్రం ఎగువన నిర్మించే అక్రమ ప్రాజెక్టులు వల్ల ఎంత నష్టమో వివరించానని పయ్యావుల తెలిపారు. తెలంగాణా, కర్ణాటకల్లో ఉన్న తమ ఆస్తులు కాపాడుకునేందుకే, ప్రభుత్వ పెద్దలు రాయలసీమను నాశనం చేసే అక్రమ ప్రాజెక్టులపై నోరు మెదపడం లేదని మండిపడ్డారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం భయపడి సస్పెండ్ చేసిందన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే కర్నూలు, అనంతపురం జిల్లాలు ఏం కావాలని ప్రశ్నించారు.

అసత్యాలనే ఎత్తి చూపుతున్నాం... రాయలసీమ జిల్లాల భూములు శాశ్వతంగా బీడుగా మారే ప్రమాదాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు. గవర్నర్ చేత ప్రభుత్వం చెప్పించిన అసత్యాలని మాత్రమే తాము ఎత్తి చూపామన్నారు. మాజీ గవర్నర్​లు, మండలి ఛైర్మన్ షరీఫ్​ను ఘోరంగా అవమానించిన వైఎస్సార్సీపీ నేతలా తమకు నీతులు చెప్పేదంటూ మండిపడ్డారు. మంత్రి చెప్పే బుర్రకథలు వినేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరని అన్నారు. అక్రమ ప్రాజెక్టుల వివరాలంటూ పలు వీడియోలను పయ్యావుల కేశవ్ మీడియాకు విడుదల చేశారు.

ప్రభుత్వంపై పయ్యావుల ఫైర్

ఇది కరివెన చివరి రిజర్వాయర్. ఓ వైపు మట్టి కట్ట నిర్మాణం జరుగుతుంది. మరో వైపు రోడ్లు, లెవలింగ్, రివిట్ మెంట్ పనులు జోరుగా సాగుతున్నాయి. అప్పర్ భద్ర నిర్మాణం పూర్తయితే.. రాయలసీమ జిల్లాలతో పాటు తుంగభద్ర పరీవాహక ప్రాంతం, శ్రీశైలంతో పాటు హంద్రీ నీవా ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అదేవిధంగా శ్రీశైలం ఎగువన తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల రాయలసీమ ప్రాంతం ఏ విధంగా నష్టపోతుందనే అంశంపై ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయాలనేది నా ఉద్దేశం. కానీ, ప్రభుత్వం భయపడుతోంది. నాలుగు నిమిషాలు మాత్రమే ప్రతిపక్షానికి కేటాయిస్తున్నారు. మళ్లీ అందులో నాలుగు సార్లు అడ్డంకులు కల్పిస్తున్నారు. ఇంకా గట్టిగా నిలదీసే ప్రయత్నం చేస్తే.. వాళ్లు ఎంచుకునే మార్గం సస్పెన్షన్ చేయడం ఒక్కటే. - పయ్యావుల కేశవ్‌, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌

అసెంబ్లీలో సీట్లో నుంచి కదలని నన్ను సస్పెండ్ చేయటం ఆశ్చర్యం కలిగిస్తోందని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు అన్నారు. సింహం సింగిల్​గా వస్తుందని చెప్పుకునే వైఎస్సార్సీపీ నేతలు... తమ సభ్యులకు సమాధానం చెప్పలేక సస్పెన్షన్ మార్గం ఎంచుకుంటున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం చెప్పించిన అసత్యాలు అసెంబ్లీలో ఆధారాలతో సహా ఎండగడతామనే తమను సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో అసెంబ్లీలో మళ్లీ అడుగుపెట్టలేని విధంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తామని నిమ్మల హెచ్చరించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details