TDP PATTABHI : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. ఇద్దరు బియ్యం బకాసరులని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. ఇద్దరు కలిపి కొన్ని వేల కోట్ల రూపాయల బియ్యం దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం దోపిడీ జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బియ్యం ఉత్పత్తి పెరగకుండా.. ఎగుమతులు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్నిపక్కదారి పట్టిస్తూ.. ఎగుమతులు చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతులు పెరిగాయని విమర్శించారు. రేషన్ స్కాంపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
వాళ్లిద్దరూ బియ్యం బకాసురులు: తెదేపా నేత పట్టాభి - ఏపీ ముఖ్య వార్తలు
TDP PATTABHI FIRES ON MINISTER : పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని మంత్రి కారుమూరి, ఎమ్మెల్యే ద్వారంపూడి పక్కదారి పట్టిస్తూ.. కోట్లు దండుకుంటున్నారని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. ఇద్దరు బియ్యం బకాసురులని వ్యాఖ్యానించారు.
TDP PATTABHI FIRES ON MINISTER