ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ఏడుగురు మంత్రులు... వైకాపా జాతిరత్నాలు: పంచుమర్తి అనురాధ - panchumarthi anuradha latest news

తిరుపతి ఉపఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్న వైకాపా మంత్రులపై.. పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైకాపా మంత్రులకు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.

tdp panchumarthi anuradha
పంచుమర్తి అనురాధ

By

Published : Apr 7, 2021, 1:35 PM IST

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఏడు నియోజకవర్గాలకు ఏడుగురు దందారాయుళ్లుగా.. వైకాపా జాతిరత్నాలు దిగారంటూ తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. మైనింగ్​లో అక్రమంగా సంపాదిస్తున్న బాలినేని వెంకటగిరి వెళ్తే, పాఠశాలల్లో కరోనా తీవ్రతపై కనీస సమీక్ష చేయని విద్యాశాఖ మంత్రి సర్వేపల్లికి ప్రచారం చేసేందుకు వెళ్లారని మండిపడ్డారు. పేకాట క్లబ్​లు తెరిచేందుకు కొడాలి నాని సత్యవేడుకు, చంద్రబాబు తీసుకొచ్చిన పరిశ్రమల్ని తరిమికొట్టిన మేకపాటి వెంకటగిరిలో ప్రచారం చేయటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఖరీఫ్, రబీకి తేడా తెలియని కన్నబాబు శ్రీకాళహస్తిలో, క్రికెట్ బెట్టింగ్​లు నిర్వహించే మంత్రి అనిల్ గూడురులో ఇన్​ఛార్జ్ మంత్రులుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేర్ని నాని ఏ మెుహం పెట్టుకుని తిరుపతి ప్రజలను ఓటడుగుతున్నారని నిలదీశారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి ఆగడాలకు అంతే లేదన్న అనురాధ..., వైకాపా మంత్రుల బెదిరింపులకు భయపడకుండా తిరుపతి ప్రజలు తెదేపాకు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details