వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని కాపు దగా నేస్తంగా వర్ణిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప బుధవారం విమర్శించారు. రైతు భరోసా కింద కాపులకు వైకాపా ఇస్తోంది 1497 కోట్ల రూపాయలేనని... తెలుగుదేశం హయాంలో రుణమాఫీ కింద వారికి నాలుగున్నర వేల కోట్ల రూపాయలు, సంక్షేమానికి అదనంగా మరో వెయ్యి కోట్లు ఖర్చు చేసిందన్నారు.
'10 శాతం మంది మహిళలకే డబ్బులు' - వైకాపా ప్రభుత్వంపై చినరాజప్ప విమర్శలు
వైఎస్ఆర్ కాపు నేస్తం పథకంపై తెదేపా నేత చినరాజప్ప విమర్శలు గుప్పించారు. పథకం కింద కేవలం 10 శాతం మంది మహిళలకు మాత్రమే డబ్బులిచ్చి మోసం చేస్తున్నారని ఆరోపించారు.
china rajappa
కాపు నేస్తం కింద 354 కోట్ల రూపాయల సాయం మాత్రమే ఇస్తున్నారన్న చినరాజప్ప.... కేవలం 10 శాతం మంది మహిళలకు మాత్రమే డబ్బులిచ్చి మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాపులకు ఉన్న 5 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేసి... వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు. ఆ సామాజికవర్గాన్ని మోసం చేస్తోందని విమర్శించారు.