బతికుండగానే మనుషుల్ని సమాధి చేసే క్రూరమైన ఆలోచనలు ప్రభుత్వానికి ఎలా వస్తున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వైకాపా పాలకులకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని మండిపడ్డారు.
'వైకాపా పాలకులకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు' - అనంతపురం జిల్లా క్రైం
అనంతపురం జిల్లా మర్రిమేకలపల్లిలో ఇల్లు కూల్చివేతలో చిన్నారి గాయపడ్డ ఘటనపై తెదేపా నేత నారాలోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికుండగానే మనుషుల్ని సమాధి చేయాలన్న క్రూరమైన ఆలోచనలు ప్రభుత్వానికి ఎలా వస్తున్నాయని మండిపడ్డారు.
తెదేపా నేత నారాలోకేశ్
అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన మర్రిమేకలపల్లిలో... ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే జేసీబీతో రాక్షసత్వంగా ఇల్లు పడగొట్టారని దుయ్యబట్టారు. ఘటనలో గాయపడ్డ చిన్నారి చావుబతుకుల్లో ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం చెల్లించకుండానే ఇళ్లను కూల్చివేయడం దారుణమైతే, మనుషులు ఉండగానే ఇళ్ళను కూల్చడాన్ని ఏమనాలని ప్రశ్నించారు.
ఇదీచదవండి.