కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గొల్లమందల గ్రామంలో పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన ఘర్షణలో గాయపడి చనిపోయిన సోమయ్య కుటుంబాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. వైకాపా నేతల దాడిలోనే సోమయ్య చనిపోయారని ఆయన ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెదేపా కార్యకర్తలపై దాడులు దారుణం.. కోర్టుకెళ్తాం: నారా లోకేశ్ - కృష్ణా జిల్లాలో నారాలోకేశ్ పర్యటన
పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా జరిగిన ఘర్షణలో గాయపడి చనిపోయిన సోమయ్య కుటుంబాన్ని తెదేపా నేత నారా లోకేశ్ పరామర్శించారు. కృష్ణా జిల్లా గొల్లమందల గ్రామంలో పర్యటించిన ఆయన... ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెదేపా కార్యకర్తలపై దాడి చేసిన ఘటనలపై కోర్టును ఆశ్రయిస్తాం : నారాలోకేశ్
సీఎం జగన్పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన ఘటనలపై కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఈ అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం కావాలో.. అంబేడ్కర్ రాజ్యాంగం కావాలో ప్రజలే తేల్చుకోవాలని లోకేశ్ సూచించారు.
ఇదీచదవండి.