ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నో పథకాలను రద్దు చేశారు: నక్కా ఆనంద్ బాబు - tdp leaders meeting

దళితులపై వైకాపా సర్కార్ అవలంబిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ... తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో చర్చ నిర్వహించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగాయని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నో పథకాలను రద్దు చేశారు : నక్కా ఆనంద్ బాబు
ఎన్నో పథకాలను రద్దు చేశారు : నక్కా ఆనంద్ బాబు

By

Published : Jun 16, 2021, 7:45 AM IST

తెదేపా ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. 'దళిత గళం-జై భీమ్' పేరిట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో... వివిధ సంఘాలు, నేతలతో వర్చువల్​ విధానంలో చర్చ నిర్వహించారు.

ఎస్సీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడాలని నేతలు తీర్మానించారు. రాష్ట్రంలో వైకాపా సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీలపై దాడులు పెరిగిపోయాయని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details