ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రివర్స్ టెండరింగ్ అంటే ఇదే: లోకేశ్

జగన్ ప్రభుత్వ తీరుపై ట్వీట్ వార్ కొనసాగిస్తున్నారు.. మాజీ మంత్రి లోకేశ్. ఈ సారి రివర్స్ టెండరింగ్​తో పాటు.. తెదేపా శ్రేణుల మీద దాడులపై వరుస ట్వీట్​లు చేశారు. రివర్స్ టెండరింగ్ అంటే వైకాపా వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడమా అని ప్రశ్నించారు.

By

Published : Jul 5, 2019, 1:34 PM IST

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

రివర్స్ టెండరింగ్ అంటే వైకాపా ఎమ్మెల్యేల సంస్థలకు టెండర్ కట్టపెట్టడమే అని ఆలస్యంగా అర్థమయ్యిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. కంపెనీలు ఉండాలంటే తమకు కప్పం కట్టాల్సిందేనంటూ వైకాపా నాయకులు... గురువారం కర్నూలులోని అల్ట్రా మెగా సోలార్ పార్కులో చొరబడి తుపాకీతో బెదిరించారని ఆరోపించారు.

రెండు రోజుల క్రితం వైకాపా ఎమ్మెల్యే మనుషులమంటూ కడప జిల్లా మైలవరం మండలంలోని ఓ సోలార్ పార్క్ లోని ప్యానల్స్ ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. వైకాపా ఎమ్మెల్యేలు పగలగొడుతుంది సోలార్ ప్యానల్స్ కాదని... ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దౌర్జన్యకాండ కొనసాగితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ పోయి... అధికార పార్టీ నాయకుల చేతుల్లో ధ్వంసమైన సోలార్ ప్యానల్స్, ఆ పార్టీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఇదీ చదవండి : రాష్ట్రంపై వయో భారం... తగ్గుతున్న యువతరం

ABOUT THE AUTHOR

...view details