ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగువారి అభివృద్ధి నినాదమై తెలుగుదేశం నిలిచింది: లోకేశ్​ - tdp leader nara lokesh formation day wishes

తెలుగు వారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన తెదేపా.. చంద్రబాబు దార్శనికతలో అభివృద్ధి నినాదమై నిలిచిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ ప్రశంసించారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 38 ఏళ్లుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం పార్టీ కృషి చేస్తున్నట్లు వివరించారు.

తెదేపా చంద్రబాబు దార్శనికతలో అభివృద్ధి నినాదమై నిలిచింది: లోకేశ్​
తెదేపా చంద్రబాబు దార్శనికతలో అభివృద్ధి నినాదమై నిలిచింది: లోకేశ్​

By

Published : Mar 29, 2020, 11:20 AM IST

ట్విటర్​ ద్వారా నారా లోకేశ్​ శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవానికి సంకేతంగా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ.. చంద్రబాబు దార్శనికతలో తెలుగువారి అభివృద్ధి నినాదమై నిలిచిందని ఆయన కీర్తించారు. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అన్న పార్టీ మూల సిద్ధాంతాన్ని విడవకుండా.. 38 ఏళ్లుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం పార్టీ కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగస్వామ్యం కావడం తనకు గర్వకారణమని ట్విటర్​ ద్వారా లోకేశ్​ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details